Monday, May 20, 2024

తెలంగాణలో రైతుల సమస్యకు పరిష్కారమే లేదా?

తప్పక చదవండి

అవిభక్త ఆంద్రప్రదేశ్‌లో జన్మభూమి, ప్రజలవద్దకు పాలన, ప్రజాదర్భార్‌,పనికి ఆహార పథకం లాంటి కార్యక్రమాలతో కొన్ని సమస్యలైన పరిష్కారమయ్యేవి.స్వరాష్ట్రం తెలంగాణలో సమస్యల సత్వర పరిష్కారం గురించి ప్రభుత్వం రూ.1.33 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు సకల సౌకర్యాలతో కార్యాలయాన్ని నిర్మించింది.అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలకు విన్నవించుకునే అవకాశం కల్పించింది.ఎమ్మెల్యేలకు కూడా అధికారులను పిలిపించుకుని సమస్యలపై సమీక్షించి పరిష్కరించే అవకాశాన్ని కల్పించింది. 2014 జూన్‌ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014 ు- 2015 వార్షిక బడ్జెట్‌ ను నవంబర్‌ 5 న రూ.1,00,637.96 కోట్లతో ప్రవేశపెట్టారు. అలాగే 2023 ు- 2024 వార్షిక బడ్జెట్‌ ను ఫిబ్రవరి 6 న రూ.2,90,396 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 వార్షిక బడ్జెట్‌ లలో రూ.17,78,277 కోట్లను కేటాయించింది.2023 ు-2024 బడ్జెట్‌ లో పంచాయతీ రాజ్‌ ,గ్రామీణ అభివృద్ధికి రూ.31,426 కోట్లు,రోడ్లు భవనాలకు రూ.22,260 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం కూడా రహదారుల అభివృద్ధి, పురోగతిని పర్యవేక్షించడానికి ఆన్‌ లైన్‌ పర్యవేక్షణ మరియు అకౌంటింగ్‌ వ్యవస్ధను అభివృద్ధి చేసినట్లుగా ప్రకటించింది. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ డిజిటల్‌ ఇండియా పోగ్రాం కింద ఇుగవర్నెన్స్‌ ,మొబైల్‌ అనువర్తనం ద్వారా ఫిర్యాదులను నమోదు చేసి అమలు చేస్తామని కూడా ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి గురించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ద్వారా 500 కంటే ఎక్కువ జనాభా,కొండ ప్రాంతా ల్లో 250 కంటే ఎక్కువ జనాభా ఉన్న 1,78,000 ప్రాంతాలలో అన్నీ కాలల్లోనూ అనుకూలంగా ఉండే రహదారులను నిర్మించి అనుసందానం చేస్తామని తెలిపింది. 1.67 లక్షల అనుసంధానం కాని అవాసాలకు 3.71లక్షల కిలో మీటర్ల విస్తీర్ణంలో రహదా రులను నిర్మించుతామని,3.68 లక్షల కిలోమీటర్ల రహదారులను నవీకరణ చేస్తామని ప్రకటించింది. 2022 2023 ఆర్ధిక సంవత్స రంకు గాను గ్రామీణ రహదారుల నిర్మాణంకు రూ.19,000 కోట్లు కేటాయించినట్లుగా కూడా తెలి పింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ రూరల్‌ డెవలప్మెంట్‌కు రూ.29,271 కోట్లు,జిల్లా,మండల పరిషత్‌ లకు రూ.500 కోట్లు కేటాయించి నట్లుగా తెలిపింది.కాని ఆచరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ గ్రామీణాభి వృద్ధికి తోడ్ప డడం లేదు.రైతులకు కనీస రవాణా సౌకర్యం ఏర్పాట్లు జరుగడం లేదు. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్లు, వి.సైదాపూర్‌ మండల కేంద్రానికి 4 కిలోమీటర్లు, చిగురుమామిడి మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు, శంకరపట్నం మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో దుద్దెనపల్లి ఉన్నది. గ్రామ పెద్ద చెరువు (పడాల చెరువు) 2021లో కురిసిన భారీ వర్షాల వలన మత్తడి దూకింది.మత్తడి నీళ్ల ప్రవా హాంతో దుద్దెనపల్లి నుండి మోగిలిపాలెం, రేకొండ గ్రామాలకు ప్రయాణించే ముడాగుల మొరం రోడ్‌ కు గండిపడిరది.2001లో పనికి ఆహార పథకం కింద నిర్మించిన కల్వర్టు మరియు పైపులు కొట్టుకుపోయాయి. రోడ్డుకు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేయగా నీటిపారుదల శాఖ అధికారులు వచ్చి రోడ్‌ గండిపడిన స్థలాన్ని పరిశీలించి మా పరిధిలోకి రాదని చెప్పారు. రోడ్డు మరమ్మతుల గురించి పంచాయతీ రాజ్‌ శాఖను కలువమని సూచించారు.మత్తడి నీళ్ల ప్రవాహంతో గండిపడిన మోగిలిపాలెం రోడ్డును,కల్వర్ట్‌ ను నిర్మించాలని దుద్దెనపల్లి గ్రామ సర్పంచ్‌, ఎం.పి.టి.సి,రైతుల సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని 2022 నవంబర్‌ 14న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌కు ఇవ్వడం జరిగింది. దానికి భవిష్యత్‌ ఉత్తరప్రత్యుత్తరాల గురించి ప్రజావాణి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కెఎ032/ఇ/2022/0006 తేది14/11/2022 రశీదును ఇచ్చారు.అలాగే హుస్నాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒడితెల సత్తీశ్‌ కుమార్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో, కరీంనగర్‌ లోక సభ నియోజక వర్గ ఎం.పి బండి సంజయ్‌ కుమార్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో కూడా విజ్ఞాపన పత్రాలను ఇవ్వడం జరిగింది. కాని ప్రభుత్వ పరంగా ఏమి స్పందన రానందున మరల 2023 జనవరి 2న కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా లేఖసంఖ్య ఎ5/ ప్రజావాణి/ 2022 గా కేసు నమోదు చేసి పంచాయతీ రాజ్‌ శాఖ పరిశీలనకు ఉత్తర్వులను ఇచ్చారు. అప్పుడు కరీంనగర్‌ జిల్లా కార్యనిర్వాహక ఇంజనీర్‌ స్పందించి ఉప కార్యనిర్వాహక ఇంజనీర్‌ హుజురాబాద్‌ సబ్‌ డివిజన్‌ను గండిపడిన కల్వర్టును, మొరం రోడ్‌ను అధ్యయ నం చేసి బడ్జెట్‌ అంచనా నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. 2023 జనవరి 17న గండిపడిన రోడ్‌, కల్వర్టును పరిశీలించి రోడ్డు నిర్మాణ అంచనా బడ్జెట్‌ రూ.78.50 లక్షలు ఖర్చు అవుతుం దని నెంబర్‌. డిబి/ప్రజావాణి/2023,తేది 21/1/ 2023 లేఖ ద్వారా జిల్లా కార్యనిర్వాహక ఇంజనీర్‌ కు నివేదిం చాడు. అట్టి నివేదికను దృవీకరించిన జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ లేఖ సంఖ్య ఎ5/ప్రజావాణి/2022 ,తేది30/01/ 2023 గల లేఖ ద్వారా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కు నివేదిం చారు. పంచాయతీ రాజ్‌ శాఖ ఇచ్చిన నివేదికపై జిల్లా పాలనాధి కారిగా కలెక్టర్‌ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు.అప్పుడు వ్యాసకర్త నైన నేను సమా చార హక్కు చట్టం 2005, సెక్షన్‌ 4(1),(సి), (డి) ప్రకారంగా గండి పడిన కల్వర్టును, రోడ్‌ను నిర్మించడానికి రూ. 78.50 లక్షల బడ్జెట్‌ అంచనా ఇచ్చిన జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యల సమా చారాన్ని ఇవ్వాలని కలెక్టర్‌ కార్యాలయ ప్రజా సమాచార అధికా రిని అడిగాను.దానికి స్పందనగా సహాయ ప్రజా సమాచార అధి కారి సహచట్టం 2005,సెక్షన్‌ 6(3) ప్రకారంగా లెటర్‌ నంబర్‌ హెచ్‌2/1539/2023 తేది 16/05/2023 ద్వారా జిల్లా పంచా యితీ రాజ్‌ ఇంజనీర్‌కు బదిలీ చేశాడు. దానికి జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ నెం.ఎ6/644/2023, తేది04/08/ 2023 లేఖ ద్వారా రోడ్‌ కల్వర్టు, మరమ్మతులకు రూ.78.50 లక్షలు మంజూరీ నిమిత్తం జిల్లా కలెక్టర్‌ కు ఇది వరకే సమర్పిం చామని సమాచారం ఇచ్చారు. గతంలో దుద్దెనపల్లి ముడాగుల మోగిలి పాలెం రోడ్‌ ద్వారా కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుండి హుస్నాబాద్‌ వరకు ప్రైవేటు బస్‌ లు నడిచేవి. రేకొండ ఎగ్లాస్‌ పూర్‌ గ్రామాల మధ్యన ఉన్న తారు రోడ్‌కు కనెక్టీవిటీ రోడ్‌గా కూడా ఉన్నది. చిగురు మామిడి, తిమ్మాపూర్‌, మానకొండూరు మండల కేంద్రాలకు, గ్రామాలకు రవాణా సౌకర్యంగా ఉపయోగపడు చున్నది. అన్నింటి కంటే ముఖ్యంగా రైతులకు ప్రధాన రహదారీగా ఉపయోగప డుచున్నది. వ్యవసాయంలో ఎద్దు,నాగలి, బండి, పలుగు వినియో గం బందయింది.యంత్రాల వినియోగం పెరిగింది. వ్యవసాయ కూలీల కొరత కూడా పెరి గింది. మోటార్‌ వాహనాల రవాణా సౌకర్యం కల్పిస్తేనే కూలీలు పొలం పనులకు వస్తున్నారు. వ్యవ సాయ రంగంలో రైతులకు రవాణా సౌకార్యం అత్యవసర మైంది. అందుగురించి గత మూడేండ్లుగా గండిపడిన కల్వర్టును, నీటి ప్రవాహానికి గుంతలు పడిన మొరం రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్‌, పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ ,మండల పరిషత్‌ అధికారికి విన్నవించినప్పటికీ రోడ్‌ మరమ్మతు లు జరుగడం లేదు.దానితో రైతులు ఎగ్లాస్‌ పూర్‌ గ్రామం మీదుగా 8 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించి పొలాల దగ్గరకు పోవుచు న్నారు.దానితో రవాణా, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి కరీంనగర్‌ జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ ఇచ్చిన రోడ్డు మరమ్మతుల అంచనా బడ్జెట్‌ ప్రకారంగా రూ.78.50 లక్షలను మంజూరు చేసి పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
కృతజ్ఞతలతో మీ భవదీయుడు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు