Wednesday, May 15, 2024

భారత్‌ పర్యటన నాకు ప్రత్యేకం

తప్పక చదవండి
  • ప్రత్యేక విమానంలో చేరుకున్న రుషి సునాక్‌
  • ఘనంగా స్వాగతం పలికిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : భారత పర్యటన తనకు చాలా ప్రత్యేకమని భారత మూలాలున్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అన్నారు. ఢిల్లీలో జరగబోతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం కోసం తన భార్య అక్షతా మూర్తితో కలిసి రిషి సునాక్‌ భారత్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం ఢిల్లీలో దిగారు. ఆయనకు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే స్వాగతం పలికారు. భారత్‌కు వచ్చే ముందు బ్రిటన్‌లో విూడియాతో సునాక్‌ మాట్లాడుతూ.. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. ’జీ20 లీడర్స్‌ సమ్మిట్‌ కోసం ఢిల్లీ పర్యటన నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను భారతదేశపు అల్లుడి గా పేర్కొంటున్నారు. ఆప్యాయతతోనే నన్ను అలా పిలుస్తున్నారని నేను ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, రిషి భార్య అక్షతా మూర్తి.. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తి కుమార్తె అన్న విషయం తెలిసిందే. దీంతో రిషిని అందరూ ‘భారత అల్లుడు’ అంటూ సంబోధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా స్పందించారు. మరోవైపు బ్రిటన్‌ ప్రధాని హోదాలో రిషి తొలిసారి ఇండియాలో అడుగుపెట్టారు. రిషికి ఢల్లీిలోని షాంగ్రిలా హోటల్‌లో బస ఏర్పాట్లు చేశారు. జీ20 సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో రిషి సునాక్‌ సమావేశం కానున్నారు. ఇకపోతే దేశ రాజధాని నగరం ఢిల్లీలో జీ20 సందడి నెలకొంది. భారత్‌ అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశం ఢిల్లీలోని భారత మండపంలో 9`10 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు స్వయంగా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఢల్లీి చేరుకున్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా కూడా ఢల్లీిలో ల్యాండ్‌ అయ్యారు. అతిథుల రాకతో రాజధాని నగరం సందడిగా మారింది

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు