Thursday, May 2, 2024

భారత దేశానికి ఎంతో గర్వకారణం..

తప్పక చదవండి
  • జీ 20 సమావేశాలపై శశిథరూర్ వ్యాఖ్యలు..

న్యూ ఢిల్లీ : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సు రెండో రోజు కొనసాగుతుంది. అయితే ఈ సదస్సుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కరిపించారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం వల్ల భారత్ కృషిని ఆయన కొనియాడారు. అలాగే ఇది భారత్‌కు ఎంతో గర్వకారణమని అన్నారు. అలాగే మన దేశం తరపున షెర్పాగా ఉన్నటువంటి అమితాబా కాంత్ పాత్రను సైతం ఆయన అభినందించారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో శశిథరూర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం విషయంలో.. ఢిల్లీ డిక్లరేషన్ తీర్మానంలో భారత్ చెప్పినటువంటి పేరాకు సభ్యదేశాలు కూడా ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏకాభిప్రాయం ఎలా సాధ్యమైనందనే దానిపా భారత్ షెర్పాగా ఉన్న అమితాబ్ కాంత్ ఓ ఇంటర్యూలో దీని గురించి చెప్పారు. ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ కథనాన్ని ట్యాగ్ చేసిన శశి థరూర్.. అమితాబా కాంత్ బాగా పనిచేశారు అని అన్నారు. మీరు ఐఏఎస్ ఎంచుకున్నప్పుడు.. ఐఎఫ్‌ఎస్ దూకుడైన దౌత్యవత్తను కోల్పోయిందని అన్నారు. ఇక రష్యా, చైనాతో జరిపిన చర్చ తర్వాత ఢిల్లీ డిక్లరేషన్‌పై ఓ ముసాయిదాను రూపొందించినట్లు పేర్కొన్నారు. అలాగే జీ 20 సదస్సులో ఇది భారత్‌కు ఎంతో గర్వకారణం అని శశిథరూర్ అన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు.. పలు అంశాలపై కూడా దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలడం భారత్‌కు అతిపెద్ద విజయమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఉక్రెయిన్ యుద్ధం అంశం విషయంలో కూడా తలెత్తినటువంటి పీటముడిని చాకచాక్యంగా పరిష్కరించగలిగినట్లు పేర్కొన్నారు. అలాగే సంయుక్త ప్రకటనలో సంబంధిత పేరాను సవరించడం వల్ల అన్ని దేశాలు తమ మద్ధతును ఇండియా సాధించినట్లు అంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు