Friday, May 3, 2024

మొదలైంది.. మంచు విష్ణు సినిమాలో యంగ్ రెబల్ స్టార్..

తప్పక చదవండి
  • విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైంది..
  • నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తున్న చిత్రం..
    హైదరాబాద్, : చాలా రోజుల గ్యాప్ తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు హీరో మంచు విష్ణు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో నిర్మించనున్న ఈ మూవీని ఆగస్ట్ 18న శ్రీకాలహస్తిలో మోహన్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మోహన్ బాబు నిర్మి్స్తుండగా.. మహాభారతం సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్ ఫేమస్ నటీనటులు కీలకపాత్రలలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతిసన్ సోదరి నుపుర్ సనన్ కథానాయికగా నటించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటించనున్నారని తెలుస్తోంది. ఇక ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించారు. ‘హర హర మహాదేవ్’ అంటూ రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. దీంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నారని అంటున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు