గోహతి : అసోంలోని జోరాబత్ ఏరియాలో ఆదివారం రాత్రి గువహటి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ. 21 కోట్లు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
హెరాయిన్‌ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మణిపూర్‌కు చెందిన మహ్మద్ అమీర్ ఖాన్, మహ్మద్ యాకుప్, మహ్మద్ జమీర్ అని పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.