Thursday, May 16, 2024

జమిలి ఎన్నికల్లో మోటార్లకు మీటర్లు పెట్టడం బీజేపీ ఎజెండా..!

తప్పక చదవండి

హైదరాబాద్ : భారతదేశంలో 70శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నది. తరిగిపోని సంపదగా భావించే 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి, ప్రకృతి ప్రసాదించిన జీవనదులున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఉత్తర ప్రగల్బాలు పలికిన మోడీ ఆదినుంచి వ్యవసాయ రంగంపై సవతి ప్రేమ చూపెట్టింది.బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ముకాసే నల్ల చట్టాలు తెచ్చి నడ్డి విరిచింది.అయితే బీజేపీ ప్రభుత్వం చెప్పుతున్నట్లు ఈ మూడు చట్టాలు ఏ మాత్రం ప్రయోజనకరమైనవి కావని,సన్నకారు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయని,ఏడాదిగా రైతులు ఆందోళనకు దిగారు.వెంటనే కొత్త సాగు చట్టాలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.అయినా కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత మొదలైంది.నల్లచట్టాలను రద్దు చేయాలంటూ లక్షలాది మంది రైతులు ఢిల్లీలో కదంతొక్కారు. 750మంది అన్నదాతలు అసువులు బాసినారు. దేశం నలుచెరుగుల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. తెలంగాణ రాష్ట్రంలో స్వయానా సీఎం కేసీఆర్ రైతులకు మద్దతుగా మహధర్నాలో పాల్గొన్నారు.ఒకదశలో కేంద్రంతో తాడో,పేడో తేల్చుకుంటామని యుద్దానికి సై అంటూ జంగ్ సైరన్ మ్రోగించారు. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. నిజంగానే కేసీఆర్ దక్షిణాదిలో అందరిని కూడగట్టితే, రైతులు కదం తొక్కితే తమ పని ఒట్టిదే అని మోడీ గ్రహించి,చివరికి తోక ముడిచి,తలవంచి న‌ల్ల చట్టాలను రద్దు చేసుకుంది.కేంద్రానికి వ్యవసాయ విధానం అంటూ లేదని,వారు చెప్పుతున్నది అంతా డొల్ల వ్యవహారమని కేసీఆర్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు.దీనికి పరిష్కార మార్గాలు చూపే ఆలోచన, ఆ మేధావితనం కేంద్రానికి లేక, అధికార బలంతో రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిళ్లు తెచ్చి ప్రతి బాయికాడ కరెంటు మీటరు పెట్టాలని చూస్తున్నది, ప్రాణం పోయినా మీటర్లు పెట్టేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక వేదికలపై రైతులకు భరోసా కల్పించారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన వైఖరిని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో శితిలమైన వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింపజేసి,తద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. మిషన్ కాకతీయతోపాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయతీరాన్ని ముద్దాడింది.దానితో రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది.తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి ఏజెండాగా కార్యాచరణ చేపట్టడం వల్లనే అనుకొన్న లక్ష్యాన్ని చేదించి,అశ్రుధారలు కారిన కళ్లనుంచే ఆనందబాష్పాలు రాలుతున్నాయి.కూలిన బతుకుల్లోంచే కొత్త జీవితాలు ఉదయించి, బీడువారిన పొలాల్లోనే పచ్చలహారాలు ప్రసరిస్తున్నాయి.అందుకు నిదర్శనం నేటి తెలంగాణ సాగు చిత్రం..నెర్రెలిచ్చి ఎర్రబారిన తెలంగాణ నేలకు జలధారను పంచి, జవజీవాలను పెంచిన నాయకుడు కేసీఆర్, తన జనంపై, తన జలంపై, తన జన్మభూమిపై మనసు నిండా ప్రేమ నింపిన తెలంగాణ ప్రదాత కన్న కలలకు సజీవ తార్కాణం.వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడమే తెలంగాణకు శాపమైంది. విత్తనోత్పత్తికి రాజధానిగా మారడమే తెలంగాణకు పాపమైంది. దినదిన ప్రవర్థమానమై ఎదిగిపోతున్న తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నది.రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.రైతన్నలకు శరాఘాతమైంది.కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి,విసృత ప్రజానీకం ప్రయోజనాలకు కాస్త పట్టం కడితే కోట్లాది జనహృదయాలు ఎలా స్పందిస్తాయో తెలంగాణ ప్రభుత్వం యావద్దేశం ముందు ప్రదర్శించి చూపారు.కేసీఆర్ జపించిన రైతు సంక్షేమ మంత్రానికి పులకరించిన తెలంగాణ పల్లెలు పోలింగ్ బూతులకు వరదలా వచ్చెటందుకు సిద్ధం అయ్యారు.అందుకే టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యాలతో ఉదరగొట్టే ఎజెండాలు తెస్తున్నారు.

- Advertisement -

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ లక్ష్యం సాధించడానికి సాలీనా 14 శాతం వేగంతో వ్యవసాయాభివృద్ది జరగాలి.ఈ సారి బడ్జెట్ లో కొంత మేలుజరుగుతుంది ఆశించినవారికి దింపుడు కళ్ళం ఆశలే మిగిలాయి. పంటల భీమా పథకాల అమలులో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు పదే,పదే చెబుతున్నా కేంద్రం ఆ దిశగా దృష్టి సారించలేదు.రాష్ట్రంలో అడ్డదారిన అధికారం చేపట్టాలని 24 గంటల ఉచిత కరెంట్, పెట్టుబడి సాయం కోసం రైతు బంధు , అకాలమరణం పొందిన కుటుంబం రోడ్ మీద పడొద్దని రైతు భీమా ,పంట రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం పై విపక్ష పార్టీ బీజేపీ చౌకబారు విమర్శలకు దిగింది.బీజేపీ నాయకత్వం మూడు నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మూడు ముఖ్యమైన విషయాలమీద ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.ఒకటి పల్లెల్లో అశాంతి నెలకొల్పి అలజడి సృష్టించి పోలింగ్ పై ప్రభావం చూపెట్టాలని,రెండవది మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే హిందూత్వం మాటున సమీకరణాలు మారి నాలుగు ఓట్లు సంపాదించాలని కలలు కంటున్నది.మూడవది రైతును నట్టేటముంచే నల్ల మొఖం చట్టాలు తెచ్చి,మేకవన్నె పులిలా అన్నదాతలను ఆగంచేసేందుకు రైతు కేంద్రంగా రైతుల చుట్టూ రాజకీయం చేస్తున్నది.పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు నిరంతరం సాగుతున్నాయి. రైతు రాజ్యంగా వెలుగొందుచున్న రాష్ట్రంలో కేసీఆర్ ను రైతులు కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఓర్వలేక విపక్షాల చిల్లర రాజకీయాల కోసం రైతులను ఉద్ధరిస్తామని చెప్పుతున్నది.ముందుచూపు లేని కారణంగా వందలాది మందిని పొట్టనబెట్టుకున్న రైతు కుటుంబాలకు మోడీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన,ఎండనక, వాననక, ఎముకలు కొరికే చలిలో,వానలో తడుస్తూ కూడ మొక్కవోని దీక్షతో పోరాడిన రైతుల విజయగాధ చరిత్రలో నిలిచిపోయింది. యుద్ధం మర్చిపోయిన దేశానికి తిరిగబడే పోరాటం నేర్పిన రైతుల కుటుంబాల ఉసురు తీసుకున్న మోడీ ప్రభుత్వానికి అంతిమగడియలు దగ్గరపడ్డాయని శాపనార్థాలు పెట్టడం గమనార్హం.

  • డాక్టర్ సంగని మల్లేశ్వర్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు