- పాఠశాల ప్రక్కన జనావాసాల మధ్యలో..
- ప్రభుత్వ అనుమంతులు లేకుండా బారు షాపు అక్రమ నిర్మాణం..
- చోద్యం చూస్తున్న అధికార గణం..
- జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ నోటీసులంటూ కాలయాపనతో అక్రమ నిర్మాణం సంపూర్తి..!
- ఆగాయిత్యం జరగకముందే జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించాలి…

- ఎల్బీనగర్ : నిబంధనలు ఎందుకు, అతిక్రమణలు ఎందుకు.. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటాం..! వక్రబుద్ధికి ధన బలం రాజకీయ బలం తోడైతే ఎంతకైనా తెగిస్తామని, మేము చేసింది ఏదైనా చెల్లుతుందని అవినీతిపరుల ధీమా..! వీరి ఆలోచనలను అంచనాలను తలకిందులు చేసి ధర్మ మార్గంలో నడిచే కొందరు అధికారులు అవినీతికి తల ఒగ్గక, సామాన్యులకు న్యాయం అందించి భరోసా కల్పించి ఆత్మస్థైర్యాన్ని నింపుతారు.. న్యాయం ధర్మం గెలుస్తుంది అనే నానుడిని బ్రతికిస్తారు. ఈ ప్రజా సమస్యపై ఏ అధికారి స్పందిస్తాడో వేచి చూడాలి మరి..! బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ లోని సాహెబ్ నగర్ నుండి సామా నగర్ వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని అక్రమంగా బార్ నిర్వహించడానికి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ముందస్తుగానే ప్రజలు పసిగట్టి, భాష్యం బ్లూమ్స్ పాఠశాలకు అతి సమీపంలో, అధిక సంఖ్యలో గృహ నివాసాలు ఉన్నచోట బార్ నిర్మాణం చేపడితే మైనర్లు మద్యానికి బానిసయి అఘాయిత్యాలకు పాల్పడి, సమాజానికి చేటు జరిగే ప్రమాదం ఉంది అని స్థానిక ప్రజానీకం నెత్తినోరు కొట్టుకొని జిహెచ్‌ఎంసి ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ల ద్వారా, వ్రాతపూర్వ ఫిర్యాదులు చేసి ఉన్నారు. అక్రమ నిర్మాణం వివరాలు
ప్లాట్ నెంబర్ 152, సర్వే నంబర్ 38, 39, సామానగర్ బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ లో భాష్యం బ్లూమ్స్ పాఠశాలకు కూతవేటు దూరంలో బార్ నిర్వహించడానికి అక్రమ నిర్మాణం చేపడు తున్నారు. జిహెచ్‌ఎంసి నుండి ఇతర ప్రభుత్వ సంస్థల నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ధనబలంతో, అధికార బలంతో అక్రమంగా బార్ షెడ్డు నిర్మాణం చేపడుతు న్నారు.. నిర్మాణ దశలో ఉండగానే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజానీకం వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసి ఉన్నారు. జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది తొందరగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ప్రాధేయ పడుతున్నారు.. ఈ బార్ షెడ్ నిర్మాణం పూర్తిగా మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా, ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారు.. ఈ అవినీతి, అక్రమంపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెద్దలు స్పందించి బార్ నిర్వహించకుండా చూడాలని ప్రాధేయ పడుతున్నారు.. జిహెచ్‌ఎంసి సిబ్బంది తొందరగా స్పందించి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి, బార్ నిర్మాణాన్ని తొందరగా కూల్చివేయాలని స్థానిక ప్రజానీకం వేడుకుంటున్నారు..