Friday, May 10, 2024

తాండూరు రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

తప్పక చదవండి
  • రూ.24.4 కోట్లతో పునరభివృద్ధి..
  • వర్చువల్గా ప్రారంభించిన దేశ ప్రధాని..
  • హాజరైన ప్రముఖులు, పలు రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు
  • శిలాఫలకను ఆవిష్కరించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న
    తాండూరు : కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత స్టేషన్‌ పథకంలో భాగంగా తాండూరు రైల్వే స్టేషన్‌ ఆధునికరణ పనులకు ఆదివారం దేశ ప్రధాని నరేందర్‌ మోడీ మర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేసి ప్రారంభించారు. తాండూరు నుంచి ప్రతి రోజు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నలభై రైలులో సుమారు 90000 ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు వీటిని దృష్టిలో పెట్టుకొని తాండూరు రైల్వే స్టేషన్‌ సుందరీకార పనులను ప్రారంభించారు ఈ ప్రారంభాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తాండూరు లో ఏర్పాటు చేసిన మర్చువల్‌ పద్ధతి అయిన ఎల్‌ఈడి స్క్రీన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారంతో ప్రారంభించారు. రైల్వే స్టేషన్‌ ఆధునికరణ పనుల వలన తాండూరు లో ఉన్న వ్యాపారానికి వర్తకులకు సిమెంటు పరిశ్రమలకు వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతగానో సౌకర్యంగాను లబ్ధి చేకూరుతుంది. గడచిన ఎన్నో సంవత్సరాల గా స్టేషన్‌ ప్రయాణికుల రద్దీ పెరగడంతో ప్రయాణికులు సౌకర్యా ల కోసం ఇబ్బంది పడేవారు ఆది వారం సుందరీకరణ పనులు చేపట్టడంతో రైల్వేస్టేషన్లో రెస్ట్‌ రూమ్‌, వెయిటింగ్‌ హాల్‌, లిఫ్ట్‌, ఎక్స్‌ లెటర్స్‌, టాయిలెట్స్‌ పార్కింగ్‌ టికెట్‌ బుకింగ్‌ తదితర సౌకర్యాలు నూతనంగా నిర్మించడం జరుగుతుందని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు వివరించారు. అదేవిధంగా ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం వచ్చే వినాయక చవితిని పర్యావరణ పరిరక్షణ జరుపుకోవాలని ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్టించాలని తెలిపారు. 8వ తేదీన క్విట్‌ ఇండియా దినోత్సవం 14న అఖండ భారత దినోత్సవం 15వ తేదీన హర్గర్థిరంగా పండుగలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు స్టేషన్‌కు సంబంధించిన నమూనాను కూడా విడుదల చేశారు. ఈ ఆధునికరణ పనులు పూర్తయితే ఆకర్షనీయంగా రైల్వే స్టేషన్‌ కనబడుతుంది. తాండూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు కార్యక్రమానికి ముందు పలు విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారు ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పత్రాలు రైల్వే అధికారులు అందజేశారు మరోవైపు ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వప్న శంకుస్థాపన శిలాఫలకను ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సదానందరెడ్డి, మురళీకృష్ణగౌడ్‌, రమేష్‌ కుమార్‌, సుదర్శన్‌గౌడ్‌ మహిళా నాయకురాలు లలిత, సాహు శ్రీలత, యువ నాయకులు రజిని, కృష్ణ టిఆర్‌ ఎస్‌ నాయకులు యలల ఎంపీపీ బాలేశ్వర గుప్తా, తాండూరు డి.ఎస్‌.పి శేఖర్‌గౌడ్‌, రైల్వే అధికా రులు అమృత్‌ భారత్‌ నోడల్‌ కోఆర్డినేషన్‌ అధికారి, సికింద్రాబాద్‌ డివిజన్‌ డి ఈ సయ్యద్‌ వసీం పషా, సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ సభ ఆఫీసర్‌ పి రవి సింగ్‌, మరియు సురేష్‌ కుమార్‌, పాండు నాయక్‌ , మరియు రైల్వే పోలీస్‌ అధికారులు అరుణ్‌ నటరాజ్‌, శ్యామ్‌ చౌహన్‌, తదితరులున్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు