Saturday, April 27, 2024

అంతిమ‌ద‌శ‌కు అక్ర‌మ నిర్మాణాలు

తప్పక చదవండి
  • డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ లో విల్లాల దందా..
  • 111 జీవోకి విరుద్దంగా అక్రమ నిర్మాణాలు
  • ఒక్కో విల్లాను రూ. కోట్లలో విక్రయిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి
  • కూల్చివేయాలని హెచ్ఎండిఎ ఆదేశాలు..
  • 3 సార్లు నోటీసులిచ్చి, చేతులు దులుపుకున్న అధికారగణం
  • 111జీవోకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాల‌కు నోటీసులేంటి..!
  • నిర్మాణాలు పూర్తికావొస్తున్న‌ స్పందించని జిల్లా కలెక్టర్..
  • అధికార ఘనుల జాప్యంపై ఆగ్రహం వెళ్లగక్కుతున్న ప్ర‌జ‌లు
  • రూల్స్ కు విరుద్దంగా నోటీసులు జారీ చేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు లేవి..?
  • అక్ర‌మాలు అని తేలితే.. చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు – డీపీవో

ఏ ప్రభుత్వమొస్తే ఏమున్నది గర్వకారణం.. జీవోలన్నీ సామాన్య ప్రజలను కట్టడి చేసేందుకే తప్ప.. అవి రాజకీయ పలుకుబడి, ఆర్ధిక బలం మెండుగా ఉన్న వారికి ఏమాత్రం వర్తించవని మరోసారి రుజువు చేస్తోంది డ్రీమ్ వ్యాలీ వ్యవహారం. అధికారుల నోటీసులు ఇక్కడ బేఖాతార్, చివరికి హెచ్ఎండిఎ కమీషనర్ ఆదేశాలను ఓ చిత్తు కాగితంలా వ్యవహరిస్తున్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ ఉదంతం ఇది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం, బాకారం జాగీర్ గ్రామ రెవిన్యూలో గల సర్వే నెంబర్ 72 లో డ్రీమ్ వ్యాలీ పేరుతో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఓ రిసార్ట్స్ ఉంది. కాగా ఈ రిసార్ట్స్ గత ప్రభుత్వంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినది కావడంతో దీని చుట్టూ ఎతైన ప్రహరీ గోడలు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటుచేసిన 111 జీవోని అమలు పరచాల్సిన అధికారులు నోటీసులతో సరిపెట్టడం గమనార్హం. రిసార్ట్స్ యజమానికి రాజకీయ పలుకుబడి పుష్కలంగా ఉండడంతోనే అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా గుప్పుమంటున్నాయి. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ లో విల్లాల నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు లేవంటూ పునాదుల సమయం నుంచి నోటీసులు ఇస్తూ వస్తున్న సంబంధిత అధికారులు.. 10, 12 విల్లాల అక్రమ నిర్మాణాలు అంతిమ దశకు చేరుకుంటున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అధికారుల‌పై ప‌లు అనుమానాల‌కు తావీస్తుంది. ఈ నిర్ల‌క్ష్యంపై పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ లో 111 జీవోకి విరుద్దంగా ఎటువంటి అనుమతులు లేకుండా అంతిమదశకు చేరుకున్న విల్లాల అక్రమ నిర్మాణాలపై జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి అధికారులు తీసుకెళ్ళ‌క‌పోవ‌డంపై ప‌లు అనుమాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికైనా ఈ అక్ర‌మ వ్య‌వ‌హ‌రాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ స్పందిస్తారా.. లేదా అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ ‘విల్లాల దందాస‌ పై, గ‌త ప్ర‌భుత్వంలో ఈ వ్య‌వ‌హారం వెనుక ఉన్న కీల‌క నాయ‌కుని పూర్తి వివ‌రాల‌తో మ‌రిన్ని ఆసక్తికర కథనాలు త్వ‌ర‌లో ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తేనుంది. మా అక్ష‌రం.. అవినీతిపై అస్త్రం..

- Advertisement -

బాకారం జాగీర్ సర్వే నెంబర్ 72 లో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ వారు చేపట్టిన విల్లాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని సంబంధిత యాజమాన్యానికి గతంలోనే నోటీసులు అందజేయడం జరిగింది. విలేజ్ కార్యదర్శిగా నేను చార్జి తీసుకున్నాక మరో రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. జీవోకి విరుద్ధంగా 12 విల్లాల నిర్మాణాలు చేపట్టారు. అనుమతులు లేవని పలుమార్లు హెచ్చరించిన ప్రయోజనం లేకపోవడంతో ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులు ఎంపీఓ, ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి రాగానే కూల్చివేత చర్యలు చేపడతాం.

  • సి. సుదర్శన్ గ్రామ కార్యదర్శి, బాకారం జాగీర్ గ్రామం.

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటైన 111 జీవో పరిధిలో అనుమతులు లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాము. బాకారం విలేజ్ లో సర్వే నెంబర్ 72, డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ లో విల్లాల పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సంబంధిత యాజమాన్యానికి ఇప్పటికే పలుమార్లు నోటీసులు అందజేశాము. నిర్మాణాలు అంతిమ దశకు చేరుకున్నాయని తెలిసింది. హెచ్ఎండిఏ నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేవు. అదనపు ఎన్ఫోర్స్మెంట్, మిషనరీ కోసం జిల్లా కలెక్టర్ అనుమతి కోరాము. ఉత్తర్వులు అందిన వెంటనే కూల్చివేత చర్యలు చేపడతాం.

  • వెంకటేశ్వర్లు ఎంపీవో, మొయినాబాద్ మండలం
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు