Saturday, May 4, 2024

7.7శాతానికి చేరువగా జిడిపి

తప్పక చదవండి
  • ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని
  • అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ

న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢల్లీిలో జరిగిన ‘ఇన్ఫినిటీ ఫోరమ్‌ 2.0’ సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ’ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత్‌ జిడిపి వృద్ధి రేటు 7.7కి చేరువయ్యే అవకాశం ఉంది. నేడు ప్రపంచం మొత్తం భారత్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఈ ఆర్థిక వృద్ధి గత పది సంవత్సరాల్లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ప్రతిబింబం. భారత్‌ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్‌ మార్కెట్‌లలో ఒకటి. జిఐఎఫ్‌టి ఇంటర్నేషనల్‌ ్గªనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సి) దాని కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.’ అని అన్నారు. ఇక ఈ సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ’గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ్గªనాన్స్‌ టెక్‌ (జిఐఎఫ్‌టి) సిటీని కొత్త యుగం ప్రపంచ ఆర్థిక, సాంకేతిక సేవల ప్రపంచ నాడీ కేంద్రంగా మార్చాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని ఆయన అన్నారు. అలాగే గ్రీన్‌ క్రెడిట్స్‌ కోసం మార్కెట్‌ మెకానిజంను అభివృద్ధి చేయడంపై తమ ఆలోచనలను పంచుకోవాలని ఆయన నిపుణులను కోరారు. ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోడీచరిష్మా మరో సారి ప్రపంచయవనికపై నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోడీ మరోసారి తన పట్టు నిలుపుకున్నారు. యూఎస్‌ ఆధారిత కన్‌స్టలెన్సీ సంస్థ మార్నింగ్‌ కన్సల్ట్‌ డిసెంబర్‌ 7న విడుదల చేసిన డేటా ప్రకారం.. మోడీ 76 శాతం రేటింగ్‌ తో అగ్రస్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రాడోర్‌ 66 శాతం ఆమోదం రేటింగ్‌తో జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.స్విస్‌ కాన్ఫెడరేషన్‌ అధ్యక్షుడు అలైన్‌ బెర్సెట్‌ 58 శాతం ఆమోదం రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. బ్రెజిల్‌ లులా డ సిల్వా, ఆస్టేల్రియాకి చెందిన ఆంథోనీ అల్బనీస్‌ వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. అయితే ఙా ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ 37 శాతం ఆమోదం రేటింగ్‌తో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు, చెక్‌ రిపబ్లిక్‌ ప్రధాన మంత్రి పీటర్‌ ఫియాలా అతి తక్కువగా 16 శాతం రేటింగ్‌ పొందారు. బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునక్‌ 25 శాతం రేటింగ్‌ పొందారు. అయితే నిరాకరణల రేటింగ్‌ విషయానికొస్తే.. మోడీని 18 శాతం ప్రజలు వద్దనుకుంటున్నారు. వారం రోజుల పాటు ఆయా దేశాల్లో స్టడీ చేసి రిపోర్ట్‌ విడుదల చేశామని కన్‌స్టలెన్సీ అధికారులు తెలిపారు. మోడీ అంతర్జాతీయ రేటింగ్‌ లో అగ్రభాగాన నిలవడంపై బీజేపీ నేతలు ఆయన నాయకత్వాన్ని కొనియా డారు. మోడీ మ్యాజిక్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సర్వే ప్రధాని పనితీరుకు నిదర్శనం అని చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు