Wednesday, May 15, 2024

త్వరలో గగనయాన్‌ తొలి టెస్ట్‌ ప్లైట్‌

తప్పక చదవండి

మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’కు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఒకటి రెండు నెలల్లో తొలి టెస్ట్‌ ప్లైట్‌ చేపట్టనుంది. ఇస్రో అధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు. వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునే వ్యవస్థను పరీక్షించేందుకు టెస్ట్‌ వెహికిల్‌ మిషన్‌ను చేపట్టనున్నారు. మొదటి టెస్ట్‌ వెహికిల్‌ మిషన్‌ టీవీడీ1 తర్వాత రెండో టెస్ట్‌ వెహికిల్‌ మిషన్‌ టీవీడీ2, మొదటి మానవరహిత మిషన్‌ ఎల్‌వీఎం3జీ1 ప్రయోగాలు జరుగుతాయని ఆ అధికారి తెలిపారు. ఆ తర్వాత ఈ ప్రయోగంలో రెండో సిరీస్‌ టెస్ట్‌ వెహికిల్‌ మిషన్స్‌ (టీవీ-డీ3, డీ4), రోబోటిక్‌ పేలోడ్‌తో ఎల్‌వీఎం3జీ2 మిషన్‌ ప్రయోగాలు జరుగుతాయని కూడా ఆయన చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు