Saturday, July 27, 2024

ప్రతి ఏటా 10వేల మంది కొత్త డాక్టర్లు

తప్పక చదవండి
  • దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 26 వైద్య కళాశాలలు
  • ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కేసిఆర్‌ సర్కారు పెద్దపీట
  • సమాచార పౌర సంబంధాల, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి

వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వి తో పాటు వైద్యశాఖ ఉన్నతాధికారులతో కలిసి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారు. ప్రారంభో త్సవ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గనులు భూగర్భముల శాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, శాసనసభ్యులు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డి, కొప్పుల మహేష్‌ రెడ్డి, కాలే యాదయ్య, బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద పటేల్‌, జెడ్పి వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, డిసిసిబి చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల రమేష్‌ , గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుశీల్‌ కుమార్‌ గౌడ్‌, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ రామ్‌ రెడ్డి, ఎంపీపీ చంద్రకళ లు ఉన్నారు.వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సమాచార పౌర సంబంధాల, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి వైద్య కళాశాలలను నెలకొల్పడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇప్పటికీ 26 వైద్య కళాశాలను ప్రారంభించడం జరిగిందని, ఈ కళాశాలల ద్వారా ఏటా పదివేల మంది డాక్టర్లను తయారు చేసుకుంటున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. వైద్య వృత్తిని వ్యాపార పరంగా కాకుండా , సేవా దృక్పథంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి వైద్య విద్యార్థులకు సూచించారు. వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం భారీ ఖర్చుతో కూడిన పని అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా వైద్య కళాశాలలను నెలకొల్పడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. వైద్యులను ప్రజలు దేవుళ్ళతో కొలుస్తారని, పేదల ప్రాణాలను కాపాడే, సేవ చేసే ఇలాంటి వృత్తిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలకు మంచి సేవలు అందించడంతో మనసుకు ఎంతో ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో 3 వైద్య కళాశాలలున్న తెలంగాణలో 36 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని మంత్రి అన్నారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందిస్తూ ప్రజల మనల్ని పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కళాశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థిని, విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.

జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు ప్రజలకు గొప్ప వరం: కలెక్టర్‌ నారాయణరెడ్డి
జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు కావడం ప్రజల అదృష్టంతో పాటు గొప్ప వరమన్నారు. జిల్లాకు వైద్య కళాశాల రావడం వల్ల ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చిందని ఆయన అన్నారు. వైద్య కళాశాలను తెలంగాణ ఊటీ గా పిలువబడే ప్రాంతంలో, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన సమస్యను తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. మొదటి బ్యాచ్‌ వైద్య విద్యార్థులు అందరికీ ఆదర్శవంతనీయంగా ఉంటూ.. రానున్న రోజుల్లో మంచి కళాశాలగా మార్చుకుందామని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, వైద్య కళాశాల ఇన్చార్జ్‌ ప్రిన్సిపాల్‌ పద్మమాలిని, సూపరింటెండెంట్‌ రామచంద్రయ్య, ఆర్డిఓ విజయకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, తాసిల్దార్‌ లక్ష్మీనారాయణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్య శాఖ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు