Sunday, September 15, 2024
spot_img

నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న 83 ఏళ్ల స్టార్‌ నటుడు..

తప్పక చదవండి

హాలీవుడ్‌ ప్రముఖ స్టార్‌, ‘ది గాడ్‌ ఫాదర్‌’ సిరీస్‌ నటుడు ఆల్‌ పాసినో 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. తన 29 ఏళ్ల ప్రేయసి, చిత్ర నిర్మాత నూర్‌ అల్ఫాల్లా ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అని తెలుస్తోంది. మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆల్‌ పాసినో- నూర్‌ మధ్య కరోనా సమయంలో పరిచయం ఏర్పడింది. 2022 ఏప్రిల్‌ నుంచి ఇద్దరూ డేటింగ్‌ చేస్తున్నట్లు వారు తెలిపారు.

కాగా, ఆల్‌ పాసినోకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాజీ ప్రియురాలు, యాక్టింగ్‌ కోచ్‌ జాన్‌ టారెంట్‌ తో ఓ కుమార్తెకు తండ్రయ్యాడు. ప్రస్తుతం ఆ కుమార్తె వయసు 33 ఏళ్లు. అనంతరం 1997 నుంచి 2003 వరకు బెవర్లీ డి ఏంజెలో తో కలిసి ఉన్నాడు. వీరిద్దరికీ కవలలు ఆంటోన్‌, ఒలివియా పుట్టారు . ప్రస్తుతం వారి వయసు 22 ఏళ్లు. ఇక నూర్‌ అల్ఫాల్లా గతంలో ప్రముఖ గాయకుడు మిక్ జాగర్, బిలియనీర్ నికోలస్ బెర్గూన్‌తో డేటింగ్ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు