Wednesday, May 15, 2024

ఈషా సింగ్‌ నేటి తరం విద్యార్థినులకు ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి

తప్పక చదవండి

మేడ్చల్‌ : 19వ ఏషియన్‌ గేమ్స్‌ లో పాల్గొని రైఫిల్‌ షూటింగ్‌ లో సత్తాచాటి ఒక గోల్డ్‌ మెడల్‌, మూడు సిల్వర్‌ మెడల్‌ సాధించిన మల్లారెడ్డి విశ్వవి ద్యాలయంలో బిబిఏ మొదటి సంవత్సరం చదువుతున ఈషా సింగ్‌ నేటి తరం విద్యార్థినులకు ఆదర్శమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ మైసమ్మగూడలో గల మల్లారెడ్డి విశ్వవిద్యాల యంలో బిబిఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఈషా సింగ్‌ 19వ ఏషియన్‌ గేమ్స్‌ షూటింగ్‌ విభాగంలో భారతదేశం తరపున పాల్గొని ఒక గోల్డ్‌ మెడల్‌ తో పాటు మూడు సిల్వర్‌ మెడల్లు సాధించడంతో మంగళ వారం మల్లారెడ్డి యూనివర్సిటిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైఫిల్‌ షూటింగ్లో సత్తా చాటి వథకాలు సాధించిన ఈషా సింగ్ను ప్రోత్సహిస్తూ మంత్రి మల్లారెడ్డి 10 లక్షల రూపాయలన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఒక మహిళ షూటింగ్‌ విభాగంలో దేశం తరపును పాల్గొని పథకాలు సాధించడం దేశంలో ప్రథమమని అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని ఈ ఘనతను సాధించడం యూనివర్సిటితో పాటు దేశానికి గర్వకార ణమని అన్నారు. ఆసక్తి ఉన్న రంగంపై దృష్టిసారించి కష్టపడితే తప్పకుండా విజయం వర్తిస్తుంది అనడానికి ఈషాసింగ్‌ జీవితమే ఆదర్శం అన్నారు. అరుదైన రంగంలో ఆసక్తి చూపిన ఈషాసింగ్ను ప్రోత్స హించిన తల్లిదం డ్రులను ఆయన ప్రత్యేకంగా అభినం దించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో రాణిస్తుందని క్రీడలలో రాణించేందుకు ఈషాసింగ్ను కూడా తెలంగాణ క్రీడాశాఖ ప్రోత్సహించిం దని తెలిపారు. అంతకు ముందు ఏయిర్పోర్ట్‌ మంత్రి మల్లారెడ్డి ఈషాసింగ్కు ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్ర మంలో మల్లారెడ్డి విద్యాసంస్థల యాజమాన్య సభ్యులు, బిఆర్‌ఎస్‌ పార్టీ మేడ్చల్‌ నియోజకవర్గ ఇంఛార్జ్‌ చామకూర మహేందర్రెడ్డి, శాలినిరెడ్డి, డాక్టర్‌ ప్రీతిరెడ్డి, వైస్‌ ఛాన్స్లర్‌ వి ఎస్‌ఎన్కెరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు