Tuesday, October 15, 2024
spot_img

మహేందర్ సింగ్ ధోనీ కొత్త లుక్..

తప్పక చదవండి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ అదిరిపోయింది.. ధోని న్యూ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హెయిర్ పెంచి నయా ట్రెండ్ లుక్కుతో దర్శనమిచ్చాడు . అయితే ఇలా చూసిన వారంతా పాత ధోనిని గుర్తు చేసుకుంటున్నారు. వింటేజ్ ధోని ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరేమో అతని జీవిత చరిత్ర గురించి వచ్చిన ఎంఎస్ ధోని సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఒకవేళ ధోనీనే సినిమా తీస్తే అతనికి సాటి ఎవరూ లేరంటూ అభిమానులు అంటున్నారు. ఇండియన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో తప్ప మిగతా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయినా ప్రతిరోజు ఏదో అంశంతో వార్తల్లో నిలుస్తున్నారు. అప్పుడప్పుడు విభిన్న వేషధారణతో ధోని ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ధోని న్యూ లుక్కుని చూసి వారెవ్వా ధోని అంటూ ఆ ఫోటోలకి లైక్స్ ఇస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు