- ఆలోచించి ధీరత్వం ప్రదర్శించాలి
- అభివృద్ది చేస్తున్న వారినే ఆదరించాలి
- తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో పథకాలు పెట్టాం
- అభివృద్దికి కేరాఫ్‌గా తెలంగాణను నిలిపాం
- ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు
- విమర్శకులకు అభివృద్దితో సమాధానం చెప్పాం
- కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం
- ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న కేసీఆర్
- మెదక్ పర్యటనలో అభివృద్ది పనులకు శ్రీకారం
హైదరాబాద్ : ఒకరు కరెంట్ విూటర్లు పెడతామంటున్నారుఉ..మరొకరు 3 గంటల కరెంట్ చాలంటున్నారు.. వీరిని దగ్గరకు తీస్తే ఆగమవుతారని గుర్తుంచుకుని ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మోటర్లకాడ విూటర్లు పెడదామా అని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని..ఎవరేందో తెలుసుకుని ఓటేసుకోవాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే వడ్ల కల్లాల వద్దకు అడుక్కుతినే వారు వచ్చినట్లు చాలా మంది బయల్దేరుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దెవా చేశారు. ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దు. ఎలక్షన్లు వచ్చిన సమయంలో ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి. నిజమేంది.. వాస్తవమేంది.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు. నిజమైన ప్రజా సేవకులను గుర్తించినట్లు అయితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అభివృద్ధి కూడా బాగా జరిగే అవకాశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఒక్కట మాట మనవి చేస్తున్నా.. ఘనపురం ఆయకట్టు గతంలో ఎప్పుడూ నీళ్లు రాలేదని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ ఇవ్వండిని అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్ కాదు.. 50 ఏండ్లు కాంగ్రెస్ పాలించింది. కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నా ఘనపురంకు నీళ్లు కావాలంటే మెదక్‌లో ఆర్డీవో ఆఫీసు వద్ద ధర్నా చేయాలి. ప్రతి సంవత్సరం ధర్నా చేస్తే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి కాదు. ఘనపురం కాల్వలలో తుమ్మ చెట్లు మెలిచాయి. కానీ నేను సీఎం అయ్యాక పద్మా దేవేందర్ రెడ్డి సర్వే చేసి.. ఘనపురం ఎత్తు పెంచుకున్నాం. కాల్వలు బాగు చేసుకున్నాం. 30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టుకు హైదరాబాద్‌కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టారు. కానీ ఈ రోజు సింగూర్‌ను మెదక్‌కే డెడికేట్ చేసుకోవడం కారణంగా బ్రహ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయి. ఘనపురం ఆయకట్టు కింద ఒక గుంట ఎండిపోకుండా పంటలు పండిరచుకుంటున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు చెట్టు ఒకరు, గుట్ట ఒకరు అయిపోయారని కేసీఆర్ గుర్తు చేశారు. భూమి ఉన్నా కూడా హైదరాబాద్ వచ్చి ఆటో రిక్షా నడిపే స్థాయికి దిగజారిపోయారు. దీంతో తెలంగాణ ఏర్పడగానే.. రైతును ఏ విధంగానైనా సరే బాగు చేయాలని సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. అదే రకంగా ఇంకా అనేక సమస్యలు పరిష్కరం చేసుకున్నాం. రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నాం. నీళ్లు మాత్రమే కాకుండా.. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రెండు పార్టీలో మనతో బరిలో ఉన్నాయి..
ఒకటి బీజేపీ.. మోటార్లకు విూటర్లు పెట్టాలని చెబుతున్నారు. కరెంట్ మోటార్లకు విూటర్లు పెట్టకపోవడంతో దాదాపు ఇవాళ మనకు రూ. 25 వేల కోట్ల నష్టం కలిగించింది కేంద్రం. కానీ ఆ బాధను అనుభవించుకుంటూ ప్రాణం పోయినా విూటర్లు పెట్టమని చెప్పాను. మరో పార్టీ.. నిన్న కాక మొన్న కర్ణాటకలో గెలిచింది. ఇష్టమొచ్చిన వాగ్దానాలు చేశారు. గెలిచిన తెల్లారే అక్కడ 7 గంటల కరెంట్ ఇస్తున్నారు. మళ్లీ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం. వాగులో, ప్రాజెక్టులో నుంచి మోటార్లు పెట్టి నీళ్లు తీసుకుంటున్నావా అని అడిగే వారు లేరు. కాబట్టే రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిరచుకుంటున్నారు అని కేసీఆర్ స్పష్టం చేశారు. మెదక్‌లో పారే హల్దీ వాగు, మంజీరా వాగులపై దాదాపు 30, 40 చెక్‌డ్యాంలు కట్టుకుని ఆ నదులు 365 రోజులు సజీవంగా ఉండేలా చేసుకుంటున్నాం. కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ ద్వారా అక్కడ్నుంచి అవసరమున్నప్పుడల్లా వాగుల్లో నీళ్లు విడుదల చేస్తున్నాం. చెక్ డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయి అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల నమ్మకానికి మారుపేరు కేసీఆర్ అయితే అమ్మకానికి మారుపేరు ప్రతిపక్షాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు విమర్శించారు. బహిరంగ సభలో ప్రతిపక్షాలపై మంత్రి విరుచుకుపడ్డారు. ప్రతి పక్షాలు సీట్లు అమ్ముకుంటారు. అన్ని అమ్ముకుంటారని దుయ్యబట్టారు. నమ్మకం ఒక వైపు ఉంది. అమ్మకం ఇంకో వైపు ఉందని అన్నారు. మెదక్ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కలని, నాడు ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారని, నేడు కేసీఆర్ జిల్లా చేసి చూపించారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణమని ఆరోపించారు. విూరు తిట్లలో పోటీ పడితే మేం పంట పండిరచే పనిలో బిజీ ఉన్నామని వెల్లడిరచారు. సమైక్య పాలనలో అన్నం తినడానికి లేని పరిస్థితి ఉంటే నేడు ఇతర రాష్టాల్రకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగామని ఆయన అన్నారు. బక్క పలుచని కేసీఆర్ తో తెలంగాణ వాస్తదా అని ఎగతాళి చేసిన నాయకులకు కేసీఆర్ తెలంగాణ తెచ్చి చూపించారని, కాళేశ్వరం పూర్తి చేసి ప్రతి పక్షాల నోరు మూయించాడని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపిలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత రెడ్డి పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-