Tuesday, October 15, 2024
spot_img

తెలంగాణతో సంబంధం ఉందని ఒప్పుకుంటావా సజ్జల : షర్మిల

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ ఏపీ పరిస్థితి ఎలా ఉందో సీఎం కేసీఆరు ప్రతీ బహిరంగ సభలో చెప్తున్నారని.. ముందు సజ్జల దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఒకప్పుడు తాను పార్టీ పెడితే తెలంగాణాలో షర్మిలకు ఏం సంబంధం అని సజల్జ అన్నారని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలతో తనకు సంబంధం ఉందని సజ్జల ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఏపీ పరిస్థితిపై అక్కడి నేతలు ఆలోచిస్తే మంచిది తెలంగాణ గురించి వాళ్లకు అనవసరమన్నారు. లెఫ్ట్‌ పార్టీల దగ్గరకు వెళ్లి మద్దతు అడుగుతున్న కాంగ్రెస్‌ నేతల్లో కొందరికి పదవి భయం పట్టుకుందని తెలిపారు. తాను కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది నిజమని.. దానికోసం ప్రచారం కూడా చేస్తానని వెల్లడిరచారు. కొన్ని కారణాల వాళ్ళ కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని అనుకున్నామని.. కొంత మంది వాళ్ళ స్వార్థం కోసం పార్టీ విలీనం కాకుండా అడ్డుకున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు