Saturday, July 27, 2024

ధరణితో దగా..

తప్పక చదవండి
  • బలిసినోళ్ళ ధరణి.. బక్క చిక్కినోళ్ళ ధరణిగా విభజించి కాజేస్తున్న బీ.ఆర్‌.ఏస్‌. నాయకులు..
  • ధరణి పేరుతో సరికొత్త దందాకు తెరలేపిన ప్రభుత్వం..
  • ధరణి అక్రమాల పుట్ట నా దగ్గర ఉంది : బక్క జడ్సన్‌
  • ధరణి పోర్టల్‌ తో రోడ్డు పాలైన పేదలు..
  • ధరణి అక్రమాలపై ప్రశ్నించినందుకు హౌస్‌ అరెస్ట్‌..
  • నల్లబెల్లి తహశీల్దార్‌ మంజూల అక్రమాలపై విజిలెన్స్‌కు పిర్యాదు చేస్తామన్న బక్క జడ్సన్‌..

హైదరాబాద్‌ : ధరణి పేరుతో జరుగుతున్న అక్రమాలపై బహిరంగ చర్చకు హైదారాబాద్‌ లోని భూ పరిపాలన ప్రధాన కమషనర్‌ కార్యాలయానికి రావాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బక్క జడ్సన్‌ కేటీఆర్‌ కు సవాలు విసిరాడు.. బక్క జడ్సన్‌ సిసిఎల్‌ఏ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా పోలీసులు బుదవారం గృహ నిర్భంధం చేశారు..ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్దనే ధరణి బాధితులతో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడుతూ.. ఇటీవలే కేటీఆర్‌ ఓ ఛానల్‌ లో ధరణి పోర్టుల్‌ ను ప్రస్తావిస్తూ భూ సమస్యల పరిష్కారానికి ధరణితో చక్కటి పరిష్కారం లభించిందని ప్రస్తావించారన్నారు.. కానీ ధరణి తప్పుల తడకగా ఉందని, దానిని నిరూపించేందుకే సి.సి.ఎల్‌. ఏ. వద్దకు రావాలని కేటీఆర్‌ కు సవాలు విసిరానని చెప్పారు.. సి.సి. ఎల్‌. ఏ. లో బహిరంగ చర్చకు అనుమతులు ఇచ్చేందుకు మొదట్లో సుముఖంగా ఉన్న పోలీసులు..అనుమతి లేదంటూ తనను గృహ నిర్బందం చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.. ధరణి అక్రమాలపై సి.సి.ఎల్‌.ఏ. లో బహిరంగ చర్చకు వస్తే దరణిలో జరిగే అక్రమాలు బహర్గతం అవుతాయనే.. తనను అడ్డుకోవడం ప్రభుత్వం చేతగానితనంగా ఆయన అభివర్ణించారు.. ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందుతుందని తెచ్చిన దరణిలో అన్నీ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పేరుతో బీ.అర్‌.ఏస్‌ నాయకులు చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ఆరోపించారు.. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో బీ.ఆర్‌.ఏస్‌. ఎంపీపీ భర్త ఊడుగుల ప్రభాకర్‌ (అలియాస్‌ ప్రవీణ్‌)తో కలసి మరి కొందరు బీ.ఆర్‌.ఏస్‌. నాయకులు, తల్లి లేని పిల్లలకు చెందాల్సిన భూమిని ఏ విధంగా కాజేశారో సాక్షాధారాలను చూపుతూ క్షుణ్ణంగా వివరించారు.. వారికి సహకరించిన తహశీల్దార్‌ పై విజిలెన్స్‌ కమిషన్‌, నేషనల్‌ హ్యుమన్‌ రైట్స్‌ లో పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.. పేదల భూమి వారికి చెందే వరకు అండగా ఉండి పోరాటం చేస్తామని బక్కా జడ్సన్‌ పేర్కొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు