Sunday, July 21, 2024

ధరణి దరిద్రం తీరేదెన్నడు.. ? మారని అధికారుల తీరు..

తప్పక చదవండి
  • ధ‌రణీతో దండిగా సంపాదించ‌డ‌మే ధ్యేయం..
  • నోట్ల‌కు ఆశప‌డి అక్ర‌మ‌ రిజిస్ట్రేష‌న్స్..
  • షాద్ న‌గ‌ర్ లో రిటైర్డ్ ఎమ్మార్వో లీల‌లు..
  • చాప‌కింది నీరులా భాను బాగోతాలు..
  • రెవెన్యూ క‌ల‌రింగ్స్ తో పోలీసుల ప్ర‌తాపం..
  • 90 మంది వృద్దులు ఒక వైపు..
  • సంజీవ‌నీ ఓన‌ర్ పత్తిపాటి శ్రీధ‌ర్, శ్రీవ‌ల్లి మ‌రో వైపు..
  • డీటీసీపీ, హెచ్ఎండీఏ ఓవ‌ర్ రైడ్ పై స‌మాధానం లేదు..
  • ధ‌ర‌ణి తెచ్చిన తంటాలపై స్పెష‌ల్ స్టోరీ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే ధరణి పోర్టల్.. దగాకోరులకు కల్పవృక్షముగా మారింది.. రెవెన్యూ శాఖ తప్పిదాలతో భూ యజమానులకు తీరని వ్యథలను సృష్టిస్తోంది.. లంచాలకు అలవాటు పడ్డ కొందరు అధికారులు ధరణిలోని లోపాలను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు.. పాత రికార్డులను తిరగేస్తూ.. లేనిపోని సమస్యలు సృష్టిస్తుండటం ఆందోళనకరంగా మారింది..

హైదరాబాద్, షాద్ న‌గ‌ర్ లో ధ‌ర‌ణి తీరుతో ఎంతో మందికి చేటు జ‌రుగుతోంది. రెవెన్యూ శాఖ త‌ప్పిదాల‌తో వీఆర్ఏ వ్య‌వ‌స్థ‌ను మాత్ర‌మే ర‌ద్దు చేసి ప్ర‌భుత్వం చేతులు దులుపుకుంది. కానీ ఇంకా ఆ శాఖ‌లో చీడ పురుగుల్లా.. లంచాల‌కు అల‌వాటుప‌డి ఎంతో మంది ఉన్న‌తాధికారులు చేయ‌కూడ‌ని పనులు చేస్తున్నారు. అందుకు పాత రికార్డులు తిరిగేసి మ‌రి వివాద‌లు సృష్టిస్తున్నారు. నోటీసులు పంపించామ‌ని చెబుతూ చేతికి అందిన కాడికి దొచుకుంటున్నారు. షాద్ న‌గ‌ర్ లోని, కొత్తూరు మండ‌లంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబ‌ర్ 97, 98లో వెలుగు చూసిన అక్రమ భాగోతం..

- Advertisement -

డ‌బ‌ల్ అంటూ ద‌గకోరు మాట‌లు :
తిమ్మాపూర్ లోని స‌ర్వే నెంబ‌ర్ 97, 98 హైద‌రాబాద్ – బెంగ‌ళూర్ హైవేకి అనుకుని ఉంటుంది. ఈ రెండు స‌ర్వే నెంబ‌ర్స్ లో 21 ఎకరాల 13 గుంట‌ల భూమి ఉంది. ఇందులో 10 ఎక‌రాల భూమి 2005లోనే డీటీసీపీ లే- అవుట్ అయింది. కానీ ప్ర‌భుత్వ రికార్డుల్లో 3 ఎక‌రాలు అద‌నంగా మరొకరి పేరుపై ఉంది. దీంతో డ‌బ‌ల్ రిజిస్ట్రేష‌న్ తెర‌పైకి వ‌చ్చాయ‌ని 2019లో తెల్చి.. అప్పుడు ప‌ట్టా పాస్ బుక్స్ ఇస్తున్నామ‌ని తెలిపారు. ఫ‌స్ట్ రిజిస్ట్రేష‌న్ ఒక్క‌టే చూశారు రెవెన్యూ అధికారులైన.. భాను.. కానీ ప్ర‌యివేట్ ప్రాప‌ర్టీలో 30 ఏళ్ల రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్స్ లో 12 ఏళ్ల పొజిష‌న్ ఎంత ముఖ్య‌మో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో కాలేదు. అప్ప‌టికే ప్లాట్స్ గా మారిన భూమిని వ్య‌వ‌సాయం చేస్తున్నార‌ని ధ‌ర‌ణి ప‌ట్టా కోసం.. త‌ప్పుడు స‌ర్వే చేసి రిపోర్టు ఇచ్చారు. ఇదే అదునుగా సంజీవ‌ని ప్రాజెక్ట్ ఓన‌ర్స్ అయిన.. ప‌త్తిపాటి శ్రీధ‌ర్, మేక శ్రీవ‌ల్లి హెచ్ఎండీఏ అనుమ‌తులు తీసుకుని పెద్ద పెద్ద బిట్స్ గా అమ్మేసుకుని రూ. 25 కోట్లు ఆర్జించారు. పాస్ బుక్స్ క్యాన్స‌ల్ అయ్యాయి. అయినా ఇంకా ఆ డ‌బ్బుల ప్ర‌వాహాంతో 90 మంది వృద్దుల‌ను ఆ ద‌రిదాపుల్లో రానివ్వ‌డం లేదు.

ఓవ‌ర్ రైడ్ పై ఎటూ తేల్చని టీపీఓ శ్రీనివాస్.. :
టైటిల్ క్లియ‌ర్ లేకుండానే హెచ్ఎండీఏ అనుమ‌తులు తీసుకున్నారు. సామాన్యుడి కళలు సాకారం కాకుండా.. దొంగ‌త‌నంగా ఈజీగా అమ్ముకునేందుకు 700 గ‌జాల నుంచి 2500 గ‌జాల వ‌రకు రూల్స్ కి విరుద్దంగా లే-అవుట్స్ చేసి రోడ్ల‌ను, పార్క్ ప్రాంతాన్ని ముంచేశారు.. గతంలో వేసిన‌ డీటీసీపీ లే-అవుట్స్ ని మార్చేశారు. అప్ప‌టి గులాబీ నోట్ల‌తో ఆఫీస‌ర్స్ ఫిదా అయిపోయి.. ఇష్టానుసారంగా వ్య‌వ‌హారించారు. అయితే పాస్ బుక్స్ ర‌ద్దు కావ‌డం. ప్లాట్ ఓన‌ర్స్ ఐక్య‌త పెర‌గ‌డంతో ఇప్పుడు అనుమ‌తులు ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ పెరిగింది. ఒకే ప్రాంతాన్ని రెండు లే అవుట్స్ గా ఎందుకు ఇచ్చారో నివేదిక ఇవ్వాల‌ని టీపీఓ శ్రీనివాస్ ని ప్రభుత్వం అదేశించింది. ప‌త్తిపాటి శ్రీధ‌ర్ కు, శ్రీవ‌ల్లితో పాటు రెవెన్యూ అధికారుల‌కు షోకాజ్ నోటీసులు పంపించారు. అయితే 10 నెల‌లు అయిన ఒక్క అడుగు ముందుకు వేయ‌క‌పోవ‌డం వెన‌క బ‌డాబాబుల హాస్తం ఉన్న‌ట్లు తెలుస్తుంది. నెల‌ల వ్య‌వ‌ధిలోనే రిజిస్ట్రేష‌న్ చేయించుకుని అనుమ‌తులు తీసుకున్న సంజీవనీ అక్ర‌మాలు
బయ‌ట‌ప‌డుతాయ‌ని భ‌య‌ప‌డుతున్నారు. అక్ర‌మాల‌న్ని స‌క్ర‌మం చేసేందుకు తుల‌సి అనే బ్రోక‌ర్ హెచ్ఎండీఏలో తిష్ట వేసి కూర్చున్నారు.

ధ‌ర‌ణి ద‌రిధ్రం చ‌రిత్ర‌ను మార్చ‌లేదు. ?
ఎన్ని కొత్త చ‌ట్టాలు వ‌చ్చినా .. పాత రికార్డుల ప్ర‌కార‌మే ప‌ని చేయాలి. కానీ ధ‌ర‌ణి పేరుతో వంద‌ల ఎక‌రాలు కొట్టేసేందుకు ప్లాన్ వేసిన రియ‌ల్ మాఫియా.. పాత రికార్డుల్లో దొరికిపోతున్నారు. హైద‌రాబాద్ – బెంగుళూర్ హై వేకి అనుకుని కొత్తూరు శివార్లులోని తిమ్మాపూర్ స‌ర్వే నెంబ‌ర్ 97,98. 10 ఎక‌రాల భూమికి 6 ఎక‌రాలు డీటీసీపీ అనుమ‌తితో.. జ‌న‌సాయి హౌజింగ్, సుప్ర‌జ హౌజింగ్ వారు ప్లాట్స్ అమ్మ‌కాలు జ‌రిపారు.. ఇందులోని రోడ్లు, పార్క్ ప్లేస్ అంతా తిమ్మ‌పూర్ గ్రామ పంచాయితీకి గిఫ్ట్ డీడ్ చేశారు. 2019 వ‌ర‌కు అంతా సేఫ్ అనుకుంటుంటే.. త‌హశీల్దార్ ఆఫీస్ లో ప‌నిచేసే భాను, రిటైర్డ్ ఎమ్మార్వో వెంక‌ట్ రెడ్డి క‌లిసి ప‌ట్టా పాస్ బుక్స్ ఇచ్చి.. వివాదం సృష్టించారు. గతంలోనే అప్ప‌టి ఐపీఎస్ లు, బ్యాట్మెంట‌న్ క్రీడా కారుడు, కోచ్, తండ్రి కూడా ప్లాట్ తీసుకున్నారంటే ఆ భూమికి ఉన్న విలువ అలాంటిది. ఆలాంటి లే-అవుట్స్ లో 2-08-2009 లో చ‌నిపోయిన కొండ అంజ‌య్య భూమి ధ‌ర‌ణి వ‌చ్చిన త‌ర్వాత రికార్డుల్లో మ‌ళ్లీ పేరు వ‌చ్చింది. దీంతో 2018 ఫిబ్ర‌వ‌రి 15న అత‌ని మ‌న‌వ‌ళ్లు డెత్ స‌ర్టిఫికేట్ అప్ల‌యి చేసుకుని ఆయ‌న భార్య రాధమ్మ పేరు మీద 2019 లో పాస్ బుక్స్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత వెంట‌ వెంట‌నే బొల్లినేని శ్రీవ‌ల్లి, ప‌త్తిపాటి శ్రీధ‌ర్ పేర్ల మీదికి వ‌చ్చేసింది. సంజీవ‌ని పేరుతో క‌ల‌ర్ ఫుల్ బ్రౌచ‌ర్స్ వేయించి ఓపెన్ స్పేస్ అంతా అమ్మ‌కాలు జ‌రిపారు. మూడు నెలల్లోనే
రీ- లే అవుట్ వేసి రూ. 25 కోట్లు దండుకుని మీరు మీరు కొట్టాడుకొండి అంటూ ప‌రార‌య్యారు.

దీనికి ముంగింపు ఎలా..?
త‌ప్పు చేసిన అధికారుల కంటే.. త‌ప్పుదారి ప‌ట్టించి కుట్ర పూరితంగా అమ్మ‌కాలు జ‌రిపిన సంజీవ‌నీ ప్రాజెక్ట్స్ డైరెక్ట‌ర్స్ పై క్రిమిన‌ల్ కేసులు పెట్టించాలి. పొజిష‌న్ లేకుండానే ప్లాట్స్ అయిన భూమిని వ్య‌వ‌సాయ భూమిగా పాస్ బుక్స్ ఇచ్చి.. పంచ‌నామా చేయించిన అప్ప‌టి ఆఫీస‌ర్స్ అయిన సూప‌రెండెంట్ భాను ప్ర‌సాద్, ఎమ్మార్వో వెంక‌ట్ రెడ్డిపై ఏసిబి విచార‌ణ జ‌రిపించాలి. ఇసుక‌లో నుంచైనా తైలం పుట్టించే ఘ‌నులు బ్రోక‌రిజం చేస్తున్నారు. అందుకు అక్ర‌మంగా త‌ప్పుదారి ప‌ట్టించి అధికారుల‌కు లంచం ఇచ్చి హెచ్ఎండీఏ నుంచి అనుమ‌తులు తీసుకున్న బ్రోక‌ర్ తుల‌సీ లాంటి వారిపై విచార‌ణ జ‌ర‌గాలి. అంతా అన్ లైన్ అయినా.. హెచ్ఎండీఏ బ్రోక‌ర్స్ హావాపై నిగ్గు తెల్చాలి. టీపీఓ శ్రీనివాస్ రావు, పోలీసుల వ్య‌వ‌హారం అప్ప‌టిక‌ప్పుడు ఎలా మార్చుకుంటారో ప్ర‌జ‌ల ముందు ఉంచేలా చేయాలి. క‌ళ్ల ముందు ఇతంటి ఘోరం జ‌రుగుతుంటే.. శాఖా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటే తప్ప ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జ‌ర‌గ‌ద‌ని బాధితులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు