Saturday, May 18, 2024

డిప్యూటీ స్పీకర్ పద్మారావు దిష్టి బొమ్మ దహనం..

తప్పక చదవండి
  • ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం..
  • పద్మారావు ప్రకటనపై ఆగ్రహావేశాలు..

హైదరాబాద్ : ఏబీవీపీ ఉస్మానియా శాఖ అధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మనికేశ్వర్ నగర్ లో ఉన్న సుమారు 2 ఏకరాల స్థలంలో పద్మారావు ఆ బస్తీ వాసులకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తానని పత్రికా ప్రకటన చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండించింది. పద్మారావుకి నిజంగా బస్తీ వాసులకు మల్టీస్పెషల్టి హాస్పిటల్ కట్ట తలుచుకుంటే అక్కడున్న వేరే ఇతర భూముల్లో కట్టివ్వాలి.. కానీ ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని అనడంపై విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ఈ విషయంపై ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్ యాదవ్ స్పందించకపోవడంపై.. విద్యార్థి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఉస్మానియా యూనివర్సిటీ భూములను ధారాదత్తం చేసి, భూకబ్జాదారులకు అప్పజెప్పుతున్న రవీందర్ యాదవుకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వహించే నైతిక హక్కు లేదు. వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.. ఇప్పటికైనా రవీందర్ యాదవ్ స్పందించి, ఉస్మానియా యూనివర్సిటీ భూమిని పరిరక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు తను చేసిన పత్రిక ప్రకటనలను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు పృథ్వీ, జీవన్, రాజు, పరుశురాం, వికాస్, సాయి, విఠల్, మధు, సందీప్, పవన్, ప్రసాద్, ఇతర విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు