Sunday, May 19, 2024

హైదరాబాద్‌కు పోటీగా ఖమ్మం దిన దినాభివృద్ది : మంత్రి పువ్వాడ

తప్పక చదవండి

ఖమ్మం : హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని 23వ డివిజన్‌లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్‌ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ విడుదల చేశారని, ఆ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహాయ సహకారాలతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ వయస్సును సర్కార్‌ పెంచినందుకు గాను నగరంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో అంగన్‌వాడీలతో కలిసి సీఎం చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్‌ హసన్‌ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు