Tuesday, October 15, 2024
spot_img

39 మందితో సీడబ్ల్యూ సి..

తప్పక చదవండి
  • తెలంగాణకు లభించని ప్రాధాన్యత..
  • తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డికి చోటు..
  • శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది..
  • ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మంది..
  • శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహ..
  • పెదవి విరుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు..

న్యూ ఢిల్లీ : ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని ప్రకటించారు. 39 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి రఘవీరారెడ్డికి చోటు దక్కింది. శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది నేతలు, ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మంది నేతలను నియమించారు,. శాశ్వత ఆహ్వానితులుగా సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర్‌ రాజనర్సింహాలను ఎంపిక చేశారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్‌ రెడ్డిలకు చోటు దక్కింది. ఇక కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఖర్గే, సచిన్‌ పైలట్‌, దిగ్విజయ్‌సింగ్‌, శశిథరూర్‌, అధిరంజన్‌, జితేంద్రసింగ్‌, అశోక్‌ చవాన్‌, దీపక్‌ బవారియాకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే సీడబ్ల్యూసీలో ఏపీ నుంచి రఘువీరారెడ్డికి చోటు దక్కగా తెలంగాణ నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లభించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే సీడబ్ల్యూసీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని అంతా భావించినా చోటు దక్కకపోవడం గమనార్హం. తెలంగాణలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎందుకు చోటు కల్పించలేరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క, సంపత్, దామోదర రాజనరసింహకు ఛాన్స్ ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే దామోదర నరసింహకి శాశ్వత ఆహ్వానితులుగా ప్రకటించడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు