Wednesday, May 15, 2024

గాంధీ కాలనీలో చెట్ల నరికివేత

తప్పక చదవండి
  • స్థానిక కౌన్సిలర్‌ భర్త దగ్గరుండి చెట్లు తొలగించిన వైనం
  • చెట్లు పెంచుడెందుకు… నరుకుడెందుకు అంటున్న స్థానికులు
    వికారాబాద్‌ : వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోనీ గాంధీ కాలనీలో కొన్ని సంవత్సరాల నుండి హరితహారం కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా పెట్టిన మొక్కలని మున్సిపల్‌ అధికారులు ప్రజాప్రతినిధులు దగ్గరుండి తొలగించడం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది కొన్ని ఏళ్లుగా పెరిగిన చెట్లని ఎలా తొలగిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఏపుగా పెరిగిన మొక్కలను అధికారుల చేత దగ్గర ఉండి వార్డు కౌన్సిలర్‌ భర్త రాజ్‌ కుమార్‌ దగ్గరుండి చెట్లను తొలగించడం ఏంటని పలువురు వాపోతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి బాధ్యత లేని ప్రజాప్రతినిధులు, విధులు నామమాత్రంగా నిర్వహిస్తున్న మున్సిపల్‌ అధికారులు స్వయంగా చెట్లు తొలగించడం ఏంటి..? జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. హరితహారం మొక్కలను తొలగించిన కౌన్సిలర్‌ భర్త పై, సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు