Monday, May 20, 2024

తిరుమలలో భక్తుల రద్దీ

తప్పక చదవండి
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది.
  • వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు.
  • తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం
    తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని నిన్న 69,365 మంది భక్తులు దర్శించుకోగా 26,006 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.05 కోట్లు వచ్చిందని వివరించారు.
    ఆగస్టు 4న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో
    ప్రతి నెల నిర్వహించే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం ఆగస్టు 4న ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు కొనసాగుతుందని అధికారులు వివరించారు. తిరుమ‌ల అన్నమ‌య్య భవనంలో జరిగే కార్యక్రమానికి భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు భక్తులు 0877-2263261 అనే నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు