Monday, May 20, 2024

సైకిల్ యాత్రికుడు రాజుకు ఘన స్వాగతం..

తప్పక చదవండి
  • అభినందనలు అందజేసిన ప్రముఖులు..

దేశం కోసం త్యాగం చేస్తూ సరిహద్దుల్లో అనునిత్యం కాపలాకాస్తు దేశ ప్రజలను సురక్షితంగా ఉంచుతున్న సైనికులకు నైతిక మద్దతు తెలిపాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేస్తూ.. జనగామ నుండి కేదార్నాథ్ వరకు చేసిన సైకిల్ యాత్ర పూర్తయ్యి జనగామకు వచ్చే సందర్భంగా పగిడిపల్లి రాజుకి ఘన స్వాగతం లభించింది.

జులై 13 వ తారీకున రిటైర్డ్ మాజీ కల్నల్ మాచర్ల బిక్షపతి జెండా ఊపి ప్రారంభించిన సైకిల్ యాత్ర రెండు వేలపై కిలోమీటర్లు పూర్తిచేసి అనేక రాష్ట్రాలు దాటుకుంటూ ఆగస్టు 30న కేదార్నాథ్ చేరుకున్నారు. కేదార్నాథ్ ఆవల ఉన్న రుద్ర ప్రయాగ బేస్ క్యాంప్ మేజర్ జనరల్ అంకుష్ శర్మ విషయం తెలిసి తన బృందాన్ని పంపి క్యాంపుకు సగర్వంగా తీసుకెళ్లి అభినందనలు అందజేశారు. మాకోసం మీలాంటి యువత ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉందని.. దేశం కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటామని మేజర్ తెలిపారు. అనంతరం కేదార్నాథ్ టెంపుల్ దర్శనం పూర్తి చేసుకొని ఢిల్లీకి వచ్చి రైలు ద్వారా వరంగల్ చేరుకున్నారు. వరంగల్ నుండి జనగామకు సైకిల్ మీద వస్తుండగా కాజీపేట, రఘునాథ్ పల్లి ప్రాంతాల్లో అనేకమంది ఘన స్వాగతం పలికారు.. ఆ తర్వాత జనగామలో యువజన సంఘాలు ఏబీవీ జూనియర్ కళాశాల విద్యార్థులు జనగామ డిసీపి, కల్నల్ బిక్షపతి జనగామలో.. జనగామ జిల్లా పూసల సంఘం వారు ఘనంగా సన్మానం చేసినారు.. పూసల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ పన్నీరు సత్యం, సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షులు తుపాకుల బాలనారాయణ, జనగామ జిల్లా పూసల సంఘం గౌరవ అధ్యక్షులు పగిడిపల్లి చంద్రమౌళి, అధ్యక్షులు చిన్నిపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పన్నీరు భానుచందర్, కోశాధికారి వెంకట్ రాములు, జిల్లా కార్యనిర్వాత కార్యదర్శి నాగిశెట్టి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి పగిడిపల్లి సత్యనారాయణ, రిటైర్డ్ ఎస్సై పన్నీరు రవీందర్, జనగామ మండల అధ్యక్షుడు పన్నీరు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి సత్యనారాయణ, మండల సంఘం మహిళా నాయకురాలు గుంటుపల్లి భారతి, ఎర్రగొళ్లపాడు అధ్యక్షుడు పన్నీర్ శ్రీనివాస్, రమేష్ ఇంద్రసేన, కరుణాకర్, పన్నీరు చంద్రశేఖర్, తల్లి దండ్రులు పగిడిపల్లి బాలమణి, శ్రీనివాస్ తదితరులు ఘన సన్మానంతో పాటు అభినందనలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు