Sunday, May 19, 2024

గాజాలో ఆకలి కేకలు

తప్పక చదవండి

గాజా స్టిప్ర్‌ : ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. గాజా ను ఇజ్రాయెల్‌ దిగ్బంధించడంతో అక్కడ పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఆహారం, ఇత ర నిత్యావసరాల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. ఆహార సంక్షోభం చుట్టుముడుతున్నది. ఈ క్రమంలో ఆదివారం వేలాది మంది ప్రజలు ఐక్యరాజ్యసమితి గోదాముల్లోకి చొరబడి ఆహార, ఇతర నిత్యావసర పదార్థాలను ఎత్తుకెళ్లారు. గోదాముల్లోకి చొరబ డటం ఆందోళనకర అంశమని, ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనడానికి ఇది సంకేతమని ఐక్యరాజ్యసమితి మానవతా విభాగం గాజా డైరెక్టర్‌ థామస్‌ పేర్కొన్నారు. ఇది ఇలావుంటే, గాజాపై రెండో దశ యుద్ధం ప్రారంభించామని.. హమాస్‌ సైనిక, ప్రభుత్వ సామ ర్థ్యాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. భూ తల, గగన, జల మార్గాల ద్వారా దాడులు కొనసాగిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌ దాడుల కారణం గా ఇప్పటివరకు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయల్‌ వద్ద బందీగా ఉన్న పాలస్తీనియన్లందరినీ విడిచిపెడితే తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులను విడిచి పెడతామని హమాస్‌ అగ్ర చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్‌ సైన్యం తిరస్కరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు