- రూ. 50 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడిన కానిస్టేబుల్
ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వటానికి స్టేషన్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పోలీస్ స్టేషన్ లోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం సిటీలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ రైడ్స్ జరిగాయి. హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బూర్ల రామారావు, విష్ణు, విజయ్ ఈ ముగ్గురిపై సీఆర్‌పిసి 41 సెక్షన్ నోటీసు ఇవ్వడానికి.. కోటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ రూ. 50 వేలు లంచం అడిగాడు. అయితే 2024 జనవరి 29న వారిని డబ్బు తీసుకురమ్మని చెప్పాడు.. అయితే వారు ముందుగా అనుకున్న విధంగా ఏసీబీ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. పథకం ప్రకారం హెడ్ కానిస్టేబుల్ కు డబ్బులు ఇవ్వడానికి సోమవారం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే కానిస్టేబుల్ కు లంచం ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా హెడ్ కానిస్టేబుల్ ని పట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా అవ్వాక్కయ్యారు. ఇదేంటే పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకోవడం ఏంటని సహ ఉద్యోగులు విమర్శించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.