Friday, September 20, 2024
spot_img

హైదరాబాద్ లో “మ్మత్తు” చాక్లెట్లు

తప్పక చదవండి
  • రాజేంద్రనగర్ లో భారీ గా గంజాయి చాక్లేట్స్ గుట్టు రట్టు.
  • 4 కేజీల గంజాయి చాక్లేట్స్ సీజ్ చేసిన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
  • కోకాపేట్ రాంకీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వద్ద అధికారుల దాడులు
  • ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్స్ గుర్తింపు.

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. ఏకంగా 4 కిలోల గంజాయి చాక్లెట్లను సీజ్ చేసిన అధికారులు.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకువచ్చి.. హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపడుతున్న అధికారులు.. ముఠా ఆట కట్టించేందుకు రంగం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో భారీ గంజాయి చాక్లెట్స్ ముఠా గుట్టు రట్టు అయింది. గంజాయి చాక్లెట్లు ఉన్నాయన్న సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. దాడులు చేసి 4 కిలోల గంజాయి చాక్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోకాపేట్ రాంకీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వద్ద సోదాలు చేసిన ఎక్సైజ్ అధికారులు.. ఓ గదిలో నిల్వ ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన గంజాయి చాక్లెట్స్‌ను గుర్తించారు. దీంతో ఆ స్టాక్ మొత్తాన్ని సీజ్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఒడిశాకు చెందిన సౌమ్యా రాజన్ అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్స్ తీసుకువచ్చి సౌమ్యా రాజన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు రోజు వారీ కూలీలకు కూడా ఈ గంజాయ్ చాక్లెట్స్‌ను సౌమ్యా రాజన్ విక్రయించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసి వారికి గంజాయి చాక్లెట్స్‌ను నిందితులు అలవాటు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. గంజాయి చాక్లెట్స్ సీజ్ చేసి.. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమీషనర్ అదేశాలతో ఈ దాడులు చేసినట్లు చెప్పారు. ఈ గంజాయి చాక్లెట్స్ దందాను ఎంత కాలం నుంచి చేస్తున్నారు.. ఎవరెవరికి విక్రయించారు.. అనే సమాచారాన్ని అధికారులు కూపీ లాగుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు