Monday, May 20, 2024

కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కంపెనీ మేనేజర్, హెచ్ ఆర్

తప్పక చదవండి

మేడ్చల్ : బీఆర్ టి యూ యూనియన్ లో చేరారని మయోర కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్ మెంట్ వారు కంపెనీ కార్మికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మేడ్చల్ జిల్లా బీ ఆర్ టి యూ అధ్యక్షులు సంబు ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లి పరిధిలోని మయోర కంపెనీలోని కార్మికులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని కంపెనీ ముందు బుదవారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సంబు ప్రభాకర్ మాట్లాడుతూ గత నాలుగు నెలల క్రితం మయోరా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు బీఆర్ టియూ యూనియన్ లో చేరడం జరిగిందని తెలిపారు. కంపెనీ మేనేజర్ వీరభద్రరావు, హెచ్ ఆర్ జోసఫ్ లు బీ ఆర్ టి యూ లో చేరిన కార్మికులను విధుల పరంగ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు వాపోయారు. యూనియన్ సభ్యులపై అక్రమంగా భౌతిక దాడులు చేయిస్తున్నారని చెప్పారు. స్నేహితులతో మాట్లాడిన మాటలను దొంగచాటున విని, వానిటి దృష్టిలో పెట్టుకొని కార్మికులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారన్నారు అని, గత సంవత్సరం 2022 కార్మికులకు రావాల్సిన కేపిఐ బోనస్ మూడు శాలరీలో సంతకం చేయించుకుని రెండు శాలరీలు మాత్రమే ఇచ్చారన్నారు. మేనేజ్మెంట్ తో ఈ విషయమై అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని దురుసుగా సమాదానం చెప్తున్నారన్నారు అని, ఇకనైనా యాజమాన్యం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని లేదంటే మున్ముందు బీ ఆర్ టి యూ తరపునా కార్మికుల పక్షాన నిలబడి కంపెనీ ముందు ధర్నా చేసేందుకైనా సిద్దమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ టి యూ జనరల్ సెక్రెటరీ సంతోష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బాల మల్లేష్, నరసింహ, ఆర్గనైజర్ సెక్రెటరీ బి శ్రీను, జాయింట్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి, మహేష్, ట్రెజరర్ సిహెచ్ ప్రసాదరావు, మురళి, వెంకటరావు, ధర్మారావు, మహేష్, వీరాంజనేయులు, స్వామి, జాంగిర్, అహ్మద్, వినోద్, హనుమంతు, శ్రావణ్ కుమార్, లక్ష్మణ్, కృష్ణారావు, సింహాచలం, వెంకటరమణ, నాగేశ్వర్, సురేన్, సురేష్, శ్రీకాంత్, వెంకటయ్య, బాలకృష్ణ, వీరాంజనేయులు, రమేష్, మురళి, రాజేందర్, జేజేశ్వర్, నాగార్జున రెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాదరావు, ఎస్ కే బాబా, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు