Friday, July 19, 2024

కమిషన్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..

తప్పక చదవండి
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డాక్టర్ కె.లక్ష్మణ్..

హైదరాబాద్, 15 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కాంగ్రెస్ ది 85 శాతం కమీషన్ ప్రభుత్వం. ప్రతి స్కీం వెనుక స్కాం దాగి ఉంది అని విమర్శించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.. దళితులను దగా చేస్తున్న సర్కార్ బీఆర్ఎస్ ది 30 శాతం కమీషన్ ప్రభుత్వం. జీరో పర్సంట్ కమీషన్ నరేంద్రమోదీ ప్రభుత్వానిదే… దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా పేదల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న ప్రభుత్వం మోదీదే.. 48 కోట్ల మంది పేదలకు జనధన్ ఖాతాలను ప్రారంభించి 2 లక్షల 70 వేల కోట్ల సొమ్మును ఆదా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం నెలకు రెండు సార్లు 15 కోట్ల మందికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తోంది. అందులో 4 కోట్ల మంది ముస్లింలు లబ్ది పొందుతున్నారు. ఎన్నికలొస్తున్నందునే కేసీఆర్ కు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకొస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యం. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా విజయ దుందుబి మోగిస్తోంది. హిందువుల మనోభావాలను దోచుకునే రీతిలో బండి సంజయ్ సారధ్యంలో బీజేపీ పనిచేస్తోంది. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్.. మోదీ ప్రభుత్వంలో 27 మంది బీసీలతోపాటు 5 మంది మైనారిటీలు మంత్రులుగా ఉన్నారు. ఛాయ్ అమ్ముకునే బీసీ వ్యక్తి మోదీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. కేసీఆర్ కేబినెట్ లో ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులు… బీఆర్ఎస్ పార్టీకి దళిత, బీసీ వ్యక్తులను సీఎం చేసే దమ్ముందా? కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలన్నీ ఒక్కటే. పార్లమెంట్ లో అన్నీ ఏకమై మోదీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు. అవినీతి పార్టీలన్నీ ఏకమైనా…బీజేపీని ఏమీ చేయలేరు. 140 కోట్ల మంది ప్రజలు మోదీ పక్షాన ఉన్నారు.. గుజరాత్, యూపీ మోడల్ పాలన కావాలంటే తెలంగాణలోనూ బీజేపీ రావాల్సిందే అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు