Wednesday, October 9, 2024
spot_img

మా స్థలాలు మాకిప్పించండి..

తప్పక చదవండి
  • సుప్రీంకోర్టు తీర్పును కూడా కేసీఆర్ అమలు చేయడం లేదు
    -15 ఏళ్లుగా పోరాడుతూ 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు
  • బండి సంజయ్ కు జేఎన్ జేహెచ్ జర్నలిస్టుల వినతి
  • న్యాయసహాయం చేయాలని విజ్ఝప్తి

‘‘ అన్నా… మేమంతా గత పాతికేళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నాం. 17 ఏళ్ల క్రితం రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న 11 వందల మంది జర్నలిస్టులమంతా కలిసి సొసైటీ గా ఏర్పడితే అప్పటి ప్రభుత్వం నిజాంపేట, పేట్ బషీరాబాద్ లలో 70 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఒక్కో జర్నలిస్టు అప్పు చేసి, పుస్తెలతాడు తాకట్టు పెట్టి 2 లక్షల చొప్పున అప్పటి మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.12 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాం. ఈ స్థలాన్ని జర్నలిస్టులకు స్వాధీనం చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 9 నెలలు దాటినా ఈ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే మా సొసైటీలోని దాదాపు 60 మంది జర్నలిస్టులు తనువు చాలించారు. మీరైనా మా స్థలాలను మాకు ఇప్పించండి’’అంటూ జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌజింగ్ సొసైటీ జర్నలిస్టులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మొరపెట్టుకున్నారు.

సొసైటీ సభ్యులు అశోక్ రెడ్డి, బోడపాటి శ్రీనివాసరావు, లక్ష్మణ్ తదితరులు బండి సంజయ్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. తాము ఏళ్ల తరబడి పనిచేస్తున్నా సొంత ఇల్లు లేక కిరాయి కట్టలేక ఇబ్బంది పడుతున్నామని, అనేక జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి స్థలాలు ఇప్పించాలని, అవసరమైన న్యాయ సహాయం చేయాలని కోరారు. జర్నలిస్టుల బాధలను సానుకూలంగా విన్న బండి సంజయ్ కుమార్ పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు