Saturday, March 2, 2024

తెలంగాణలో త్వరలో బీజేపీ ప్రభుత్వం

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలించేది కొద్ది రోజులే
  • కేసీఆర్‌ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్‌ చేతులెత్తేస్తుంది
  • దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేసీఆర్‌ పై ఫైర్‌
  • బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : తెలంగాణలో బీజేపీకి 8 స్థానాలు ఇచ్చినందుకు ప్రజలకు గోషామహల్‌ ఎమ్మెల్యే కె. రాజాసింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మోసం చేసిన కేసీఆర్‌ను ప్రజలు ఫాంహౌస్‌ కు పంపించేశారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానన్న కేసీఆర్‌నే ప్రజలు మార్చారని గుర్తు చేశారు. బుధవారం రాజాసింగ్‌ మీడియాతో మాట్లాడారు. ఏడాది తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ రాజాసింగ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని అన్నారు. ఒక్క ఏడాదికి మించి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండదని, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని అన్నారు. కేసీఆర్‌ సీఎంగా దిగిపోతూ రాష్టాన్రికి గుంతలు పెట్టి వెళ్లారని, వాటిని పూడ్చడానికే కాంగ్రెస్‌ కు సరిపోతుందని అన్నారు. పైగా కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇవన్నీ భరించలేక కాంగ్రెస్‌ పార్టీలో కల్లోరం రేగి దిగిపోతుందని అన్నారు. అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా తాము ఆయన విగ్రహానికి నివాళి అర్పించామని అన్నారు. ఇలాగే ప్రతి కార్యాలయంలోనూ నివాళి అర్పిస్తామని అన్నారు. మరి మాజీ సీఎం కేసీఆర్‌ ఎందుకు అంబేడ్కర్‌ కు ఒక్కసారి కూడా నివాళి అర్పించలేదని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు