Friday, May 17, 2024

వెట్టి చాకిరీకి స్థానం లేదు

తప్పక చదవండి
  • బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు: సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

సంతోషంగా చదువుకుంటూ ఆట పాటలతో సాగాల్సిన పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ పిలుపునిచ్చారు. శుక్రవారం నెరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ పదవ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. సమాజంలో బాల కార్మిక వ్యవస్థ ఒక వ్యాధిలాగా మారిందని, అది ఎంతో మంది అమాయక పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వెట్టి చాకిరీ కోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, తమ పిల్లలను మాత్రం వెట్టి చాకిరీ కూపంలోకి నెట్టకూడదని, పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలన లో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, ప్రజలు కూడా దాన్ని తమ నైతిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

రాచకొండ పరిధిలో మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా మీద ఉక్కు పాదం మోపుతున్నమని, ప్రత్యేక బృందాల ద్వారా ఎంతో మందిని రక్షించామని, కేసులు నమోదు చేశామని తెలిపారు. ఒడిషా, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టి కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకూడదు అని వారి నివాస ప్రాంతం లోనే వర్క్ సైట్ పాఠశాలలను నడుపుతున్న విషయం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఏసిపి వెంకటేశం, రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి శ్రీ కృష్ణ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యుసి చైర్మన్ నరేంద్ర, మేడ్చల్ జిల్లా సిడబ్ల్యుసి రాజా రెడ్డి, యాదాద్రి సిడబ్ల్యుసి చైర్మన్ జయశ్రీ, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ వైద్యాధికారిణి డాక్టర్ గీత, డి.సి.పి.ఓ. లు ప్రవీణ్, ఇంతియాజ్, సైదులు, బాలరక్ష భవన్ అధికారులు, చైల్డ్, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, బచపన్ బచావో ఆందోళన్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, చైల్డ్ లైన్ అధికారులు, ఇతర రాచకొండ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు