Sunday, May 5, 2024

మహిళల వస్త్రధారణపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు..

తప్పక చదవండి
  • హోం మంత్రి వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి..
  • మహిళలు నెత్తి మీద హిజాబ్ ధరిస్తేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారని
    మాట్లాడడం మహిళలను అవమానించడమే..
  • ధ్వజమెత్తిన బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ దేవి..

ఆరు నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలపై ఏ రోజు మాట్లాడని హోమ్ మంత్రి మహిళల వస్త్రధారణ వాటికి కారణం అన్నట్లుగా మాట్లాడడం చేతగాని తనానికి నిదర్శనం. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించటమే, కించపరచడమే.
తెలంగాణ రాష్ట్రంలో పసి పిల్లలపై, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలపై రోజుకు సగటున ఏడు POCSO కేసులు కేసులు నమోదయితున్నాయి. దానికి కూడా వస్త్రధారణ కారణమా….? బాధ్యత లేని హోంమంత్రి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎంఐఎం, టిఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో అత్యాచారాలకు హత్యలకు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించలేని అసమర్ధ హోంమంత్రి మహమూద్ అలీ. టిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా నేటికీ కేసు ఫైల్ చేయకపోతే , ఢిల్లీకి వెళ్లి న్యాయం కోసం పోరాడాల్సినటువంటి దుస్థితి తెలంగాణ మహిళలకు పట్టింది. మహిళలకు మొదటి క్యాబినెట్లో ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేని వాళ్ళు, మహిళా కమిషన్ కు చైర్మన్ ను ఆరెళ్లకుగానీ నియమించలేని చేతగాని ప్రభుత్వ పెద్దలు మహిళల వస్త్రధారణ పై అవాకులు చావాకులు పేలితే తెలంగాణ మహిళలు కచ్చితంగా బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు