Monday, June 17, 2024

నరకాసుర న్యూ లుక్‌తో రక్షిత్‌..

తప్పక చదవండి

‘పలాస 1978’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు యువ హీరో రక్షిత్‌. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. రక్షిత్‌ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. డాక్టర్‌ అజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఇవాళ మేకర్స్‌ రక్షిత్‌కు బర్త్‌ డే విషెస్ తెలియజేస్తూ.. కొత్త లుక్ ఒకటి లాంఛ్ చేశారు. ఈ లుక్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
విభిన్నమై కథాంశంతో రాబోతుంది నరకాసుర. రక్షిత్‌ మరోవైపు ఆపరేషన్‌ రావణ్‌ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన లుక్‌, గ్లింప్స్ వీడియో ఒకటి నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. ఇంటెన్సివ్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్‌.

మీ ఆలోచనలే మీ శత్రువులు.. అనే ట్యాగ్‌లైన్‌తో హై ఆక్టేన్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ సంగీర్తన విపిన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రక్షిత్‌ మరోవైపు రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ శశివదనేలో కూడా నటిస్తున్నాడు. కోమలీ ప్రసాద్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. సాయి మోహన్‌ ఉబ్బన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు