Wednesday, February 28, 2024

బీ.ఆర్.ఎస్. పార్టీ నేతల కీలక సమావేశం..

తప్పక చదవండి
  • మంత్రి హరీష్ ఆధ్వర్యంలో మీటింగ్..
  • కాంగ్రెస్ పార్టీ గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారు..
  • మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారు..
  • అమలుగాని మేనిఫెస్టో కాంగ్రెస్ వారిది..
  • నేతలకు హరీష్ రావు దిశా నిర్ధేశం..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌ లో బీఅర్ఎస్ పార్టీ నేతలు కీలక సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి హరీష్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జిలు, వార్ రూం ఇన్చార్జిలు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫేస్టో ను ఇంటింటికి తీసుకెళ్ళె అంశంపై మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. మూడోవ సారీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని అన్ని సర్వేలు చెప్తున్నాయన్నారు. నేతలందరూ సీరియస్‌గా నెల రోజులు కష్ట పడాలని, అవసరం అయితే ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ రాత్రుళ్లు కూడా నేతలు పడుకోవాలని సూచించారు. ఒక ప్లాన్ ప్రకారం అందరూ ముందుకు వెళ్లాలన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలముందుకు బలంగా తీసుకు పోవడంలో కోంత వెనుక బడుతున్నామన్నారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని హరీష్ రావు విమర్శించారు. తండాలను పంచాయతీలుగా చేశామని, పొడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పథకాల గురించి ప్రజలకు తెలియ పరచాలన్నారు. ప్రతి రోజు మేనిఫెస్టోను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పేపర్‌ల ద్వారా, ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించాలని, డోర్ టు డోర్ తిరగాలన్నారు. ప్రతి రోజు మేనిఫెస్టో అంశంపై అందులో పొందు పరిచిన అంశాలు మీడియాతో ఒకరు మాట్లాడాలన్నారు. లోకల్ కేబుల్ టీవీ నెట్ వర్క్‌లతో మాట్లాడాలని, అవసరం అయితే యాడ్స్ ఇవ్వాలని సూచించారు. సీఎం సభ జరిగే ప్రదేశాల్లో మేనిఫెస్టో అంశాలు ఫ్లెక్స్‌లు ఎర్పాటు చెయ్యాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై మైండ్ గేమ్ ఆడుతోందని, తిప్పి కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకూ తెలియపరచాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఏలా ఉన్నాయో ప్రజలకు తెలియపరచాలని మంత్రి హరీష్ రావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు