Sunday, April 28, 2024

అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ

తప్పక చదవండి
  • 15మంది శిశువుల జననం

ఇండోర్‌ : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగిన వేళ పలువురు గర్భిణులకు చిరస్మరణీయ క్షణంగా నిలిచిపోయింది. ఈ పవిత్ర సమయంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రెండు ప్రభుత్వాసుపత్రుల్లో 15మంది శిశువులు జన్మించారని అధికారులు వెల్లడిరచారు. వీటిలో 11 సాధారణ ప్రసవాలు కాగా.. మిగిలినవారికి సిజేరియన్‌ ద్వారా కాన్పులు జరిగినట్లు ఎంటీహెచ్‌ ఆస్పత్రి సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సుమిత్రా యాదవ్‌ వెల్లడిరచారు. పుట్టిన శిశువులంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. మరోవైపు, దేపాల్‌పుర్‌ సివిల్‌ ఆస్పత్రిలో లోకేశ్‌, సంజన దంపతులకు ఆడ శిశువు జన్మించినట్లు అక్కడి వైద్యురాలు తెలిపారు. సంజనకు జనవరి 22న కాన్పు చేయాలని తాను ముందుగానే వైద్యులను కోరగా.. ప్రసవానికి తగిన సమయం పూర్తికాకపోవడంతో వైద్యులు నిరాకరించారని లోకేశ్‌ అనే వ్యక్తి తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 11గంటల సమయంలో తన భార్యకు నొప్పులు రావడంతో సిజేరియన్‌ చేశారని, తమకు పాప పుట్టిందని.. తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు అతడు ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇందౌర్‌లో జనవరి 22న జన్మించిన 15మందిలో మగ, ఆడ శిశువులు ఎందరనే వివరాలు మాత్రం తెలియలేదు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఈ చారిత్రక రోజును చిరస్మరణీయంగా మలచుకోవాలన్న ఆశతో ప్రసవ తేదీ దగ్గరపడిన అనేకమంది గర్భిణులు తమకు సిజేరియన్‌ ప్రసవం చేయాలని వైద్యులపై ఒత్తిడి చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు