Saturday, April 27, 2024

లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ

తప్పక చదవండి
  • తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు ఎన్నికలపై ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జీలను ప్రకటించింది. అయితే బీజేపీకి లోక్ సభ స్థానాలు అత్యంత కీలకం కావడంతో ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక 17 మంది ఇన్చార్జుల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో కంటే అసెంబ్లీ సీట్లు ఎక్కువ గెలుచుకున్న బీజేపీ లోక్ సభ సీట్ల విషయంలో అదే జరుగుతుందా లేక నిరాశపరుస్తుందా అనేది మాత్రం ఫలితాల తర్వాతే తెలుస్తుంది.లోక్ సభ ఎన్నికలకు ఇన్చార్జుల్లో హైదరాబాద్ ఇన్చార్జిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ను సికింద్రాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర అధినాయకత్వం.

నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు:
ఆదిలాబాద్ – పాయల్ శంకర్ (ఎమ్మెల్యే)
పెద్దపల్లి – రామారావ్ పవార్ (ఎమ్మెల్యే)
కరీంనగర్ – సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)
నిజామాబాద్ – మహేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే)
జహీరాబాద్ – కె.వెంకటరమణా రెడ్డి (ఎమ్మెల్యే)
మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)
మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)
సికింద్రాబాద్ – డాక్టర్ లక్ష్మణ్ (ఎంపీ)
హైదరాబాద్ – రాజాసింగ్ (ఎమ్మెల్యే)
చేవెళ్ల – ఏ వెంకటనారాయణ రెడ్డి (ఎమ్మెల్సీ)
మహబూబ్ నగర్ – రామ్ చందర్ రావు (మాజీ ఎమ్మెల్సీ)
నాగర్ కర్నూల్ – రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
నల్గొండ – చింతల రామచంద్రా రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు