Wednesday, May 15, 2024

తిరుమలలో నడక మార్గంలో మరో చిరుత..

తప్పక చదవండి
  • లక్షితను చిన్నారిని చంపిన ప్రాంతంలోనే తిరుగుతున్న పులి
    తిరుమల: తిరుమల కాలినడక మార్గంలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు. గత నెలలో పులిదాడిలో మరణించిన నెల్లూరు చిన్నారి లక్షిత మృతదేహం దొరికినచోటే ఈ ఐదో చిరుత తిరుగుతున్నట్లు గుర్తించారు. అలిపిరి కాలిబాట లక్ష్మీనరసింహ ఆలయం వద్ద సంచరించిన దృష్యాలు అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో అధికారులు దానిని పట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు.
    అలిపిరి మెట్లమార్గంలో మొత్తం ఐదు చిరుత పులులు తిరుగుతున్నట్లు టీటీడీ, అటవీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. వాటిలో ఇప్పటికే నాలుగు చిరుతలు బోనుల్లో చిక్కాయి. తాజాగా మరొకటి కనిపించడంతో దానిని కూడా వీలైనంత త్వరగా పట్టుకోవాలని నిర్ణయించారు. అయితే తిరుమల అడవుల్లో మొత్తం ఎన్ని చిరుత పులులు ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు