Saturday, July 27, 2024

నిత్యావసర వస్తువులపై అమెజాన్‌ ఫ్రెష్‌ ఆఫర్స్‌…

తప్పక చదవండి

హైదరాబాద్‌: పండుగల సీజన్‌ మొదలవుతుండటంతో తమ వినియోగదారుల కోసం అమెజాన్ ఫ్రెష్ సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్‌ పేరుతో ఓ సేల్‎ను ప్రకటించింది. ఈ సేల్ ద్వారా తాజా పండ్లు, కూరగాయలు, కిరాణా సామాగ్రి, రోజువారీ నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వాటితోపాటు ప్యాకేజ్డ్ ఫుడ్స్, పర్సనల్ కేర్, బేబీ కేర్, పెట్ కేర్ ఉత్పత్తులపై 45% వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా కొన్ని బ్యాంకు కార్డులపై అమెజాన్‌ రాయితీ ఇస్తోంది. కస్టమర్స్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ కార్డ్‌లపై 10% డిస్కౌంట్, సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. కొత్త కస్టమర్‌లకు తమ మొదటి నాలుగు ఆర్డర్లపై రూ.400 వరకు క్యాష్‌ బ్యాక్‌ లభించనుంది. పాత కస్టమర్లకు తమ తదుపరి అమెజాన్ ఫ్రెష్ ఆర్డర్‌పై రూ.150 వరకు క్యాష్‌ బ్యాక్‌ను అందనుంది. జన్మాష్టమి సందర్భంగా అమెజాన్ ఫ్రెష్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూలు అందుబాటులో ఉంచారు. ఆయిల్ ప్యాకెట్స్, స్వీట్స్, డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, జ్యూసెస్ కూడా ఈ ఆఫర్‎లో అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వెంటనే అమెజాన్.ఇన్‎లో షాపింగ్ చేసేయండి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు