Saturday, May 4, 2024

కంటిని పూర్తిగా మార్చివేసిన అమెరికా వైద్యులు

తప్పక చదవండి

న్యయార్క్‌ ; అంధత్వాన్ని, దృష్టి లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పిడి వంటివి చేస్తున్నా న్యూయార్క్‌లోని వైద్యులు మాత్రం అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా ఓ వ్యక్తి కంటిని మార్చివేసి రికార్డు సృష్టించారు. ఇలాంటిది ప్రపంచంలోనే తొలిసా రి అని చెబుతున్నారు. అయితే ఆ కన్నుద్వారా దృష్టి వస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది. అ ధిక వోల్టేజీ ఉన్న విద్యుత్తు తీగలు తగిలిన కారణంగా ఆరన్‌ జేమ్స్‌ అనే వ్యక్తి ముఖం చాలావరకు కాలిపోగా ఒక కన్ను మొత్తం పోయింది. కుడి కంటిని రెప్పతో సహా సమూలంగా మారిస్తే ఆయన ముఖానికి కొత్తరూపు ఇచ్చినట్లవుతుందని న్యూయార్క్‌సిటీలోని లాంగోన్‌హెల్త్‌ ఆసుపత్రి వైద్యులు భావించారు. ఆ ప్రకారం మే నెలలో 21 గంటలసేపు చేసిన శస్త్రచికిత్స విజయవంతమై కొత్తకన్ను
ఆరోగ్యంగా ఉందని వారు గురువారం ప్రకటించారు. కన్నును మూసి, తెరవడం సాధ్యం కాకపోయి నా కంటిపై స్పర్శ మాత్రం తెలుస్తోందని జేమ్స్‌ చెప్పారు. భవిష్యత్తులో ఇది ఎన్నో నూతన మార్గాలకు ద్వారం తెరుస్తుందని వైద్యులు చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు