Tuesday, April 30, 2024

ప్రజా సేవకుడు మన ‘‘స్పీకర్‌’’

తప్పక చదవండి
  • మర్పల్లికి చెందిన ఓ నిరుపేద దంపతులకు తలకు పెద్ద కంతితో జన్మించిన చిన్నారి
  • ఆపరేషన్‌ కొరకు వైద్య ఖర్చులకు ఎల్‌ఓసి అందజేసిన శాసన సభాపతి
  • ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంతో ప్రసాద్‌ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు..

నా జీవితం ప్రజా సేవకే అంకితం అని ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎమ్మెల్యే గా గెలుపొంది స్పీకర్‌ పదవి చేపట్టిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అను నిత్యం ప్రజా సేవలోనే మునిగి తేలుతున్నారు. వైద్య సహాయం కొరకు ప్రజలు ఎవరు సంప్రదించిన తక్షణమే స్పందిస్తూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేసి ప్రజా సేవకుడిగా తమదైన మార్క్‌ వేసుకుంటున్నారు.తాజాగా వికారా బాద్‌ నియోజకవర్గ పరిధిలోని మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కావలి సద్గుణ వరాలు అనే దంపతులకు ఫిబ్రవరి 3వ తేదీన నీలోఫర్‌ ఆసుపత్రిలో తలకు పెద్ద కంతితో కూతురు జన్మించింది. అయితే కంతితో తీసివేయడానికి ఆపరేషన్‌ చేసి తొలగించాల్సి ఉండగా విషయం తెలుసుకున్న శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తానే స్వయంగా ఆపరేషన్‌ కోసం నిమ్స్‌ వైద్యులతో మాట్లాడి వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల ఎల్‌ఓసిని అందజేయగా ఆపరేషన్‌ నిర్వహించిన నిమ్స్‌ వైద్యులు చిన్నారి(పాప) తల నుండి కంతిని విజయవంతంగా తొలగించారు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు