Sunday, May 5, 2024

మొదటి జాబితాలో 70 మంది..

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా కసరత్తు పూర్తి
  • త్వరలోనే అధిష్ఠానానికి తొలి జాబితా..!
  • అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌
  • ముగిసిన స్క్రీనింగ్‌ కమిటీ భేటీ
  • 5 గంటలపాటు కొనసాగిన సమావేశం
  • 60 శాతానికి పైగా ఏకాభిప్రాయంతో ఫైనల్‌
  • ఆశావహుల్లో నెలకొన్న సందడి..
  • కమిటీకి సిఫార్సు చేసుకునే పనిలో నిమగ్నం
  • రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ల మధ్య వాదనలు

కాంగ్రెస్‌ పార్టీలో ఏకాభిప్రాయం కుదిరినట్లేనా..? సీట్ల పందేరం ఒక కొలిక్కి వచ్చినట్లేనా..? అవునని సమాధానం ఇస్తున్నారు కాంగ్రెస్‌ పెద్దలు.. కర్ణాటకలో అధికారం చేపట్టిన తర్వాత ఆత్మవిశ్వాసంతో సాగుతున్న కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల పంపకం ఒక ప్రసహనంగా మారింది.. అయితే ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా 60 శాతానికి పైగా పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది.. కాగా అభ్యర్థుల ఎంపికలో సర్వే రిపోర్టు, సామాజిక వర్గం, బలమైన అభ్యర్థి అంశాలపై స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించింది. ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్‌ వార్‌ రూములో స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది.
హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్ధుల ఎంపికపై గురువారం, శుక్రవారం సుదీర్ఘంగా ఈ కమిటీ చర్చించింది. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తైనట్లు టాక్‌. అయితే టికెట్‌ కేటాయింపులపై వార్‌ రూంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్ల తెలుస్తుంది. 60 శాతానికి పైగా ఏకాభిప్రాయంతో అభ్యర్ధులను స్క్రీనింగ్‌ కమిటీ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరోసారి ఈ కమిటీ సమావేశం కానుంది. పూర్తి జాబితాను కాంగ్రెస్‌ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్‌ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. గురువారం సాయంత్రం మురళీధరన్‌ అధ్యక్షతన సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ అర్ధరాత్రి వరకు చర్చించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వివాదరహిత నేతల జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి పంపాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల అసంతృప్తులు, రెబల్స్‌ తయారు కాకుండా కాంగ్రెస్‌ అధిష్టానం నజర్‌ పెట్టింది. వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌గా అడుగులు వేస్తోంది.
అయితే, వచ్చే వారం మరోసారి స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని 63 నియోజక వర్గాలపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్‌ ఐదు గంటల పాటు స్క్రీనింగ్‌ కమిటీ సమాలోచనలు చేశారు. స్క్రీనింగ్‌ కమిటీ తొలి జాబితాను సిద్ధం చేసి అధిష్ఠానానికి ఇవ్వనుంది. ఆ జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌కు మురళీధరన్‌ ఇవ్వనున్నారు. త్వరలో పార్టీ ఎన్నికల కమిటీ తుది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా అక్టోబర్‌ తొలివారంలో తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వివాదాలు లేని నియోజకవర్గాల జాబితాను తయారుచేసి కేంద్ర స్క్రీనింగ్‌ కమిటీకి పంపాలని నిర్ణయించారు.
కొన్ని నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం, ఒకే అభ్యర్థి ఉన్నా.. ఇంకా మెరుగైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.పీసీసీకి వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి ఏఐసీసీ ఎన్నికల కమిటీకి పంపాల్సిన జాబితాపై సుదీర్ఘంగా కసరత్తులు చేస్తోంది. ఏకాభిప్రాయం ఉన్న చోట మినహాయిస్తే.. మిగిలిన చోట్ల పోటీ తీవ్రంగా ఉన్నందున ఎన్నికల వేళ అసంతృప్తులు, రెబల్స్‌ తయారవకుండా జాబితాను రూపొందేలా దృష్టి సారించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకరికంటే ఎక్కువ ఆశావహులు పోటీపడే నియోజకవర్గాలపై.. ఇవాళ జరిగే భేటీల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన ఇవాళ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే తొలి జాబితాను అందిస్తామని ఇప్పటికే పార్టీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ.. అభ్యర్థుల ఎంపి ను పూర్తి చేయనుంది. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ప్రతిపాదనలపై ఇప్పటికే సర్వే పూర్తైనట్లు సమాచారం. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా ఈ అభ్యర్థుల ఎంపికను చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ప్రత్యర్థులతో తలపడే శక్తిసామర్థ్యం ఉందా లేదా కోణంలోనూ సర్వే నిర్వహించినట్లు సమాచారం. 25 నుంచి 30 చోట్ల ఇద్దరి పేర్లు, దాదాపు 50 నియోజకవర్గాలకు ముగ్గురు, మరో 10 నుంచి 14 నియోజకవర్గాలకు నలుగురి పేర్లను.. స్క్రీనింగ్‌ కమిటీకి పీఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తంగా కలిపి దాదాపు 300 మంది పేర్లను ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ.. స్క్రీనింగ్‌ కమిటీకి సిఫార్సు చేసింది. పీఈసీ జాబితా నిశితంగా పరిశీలించి అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రానుంది. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ విధానంలో జమిలి ఎన్నికలు వస్తున్నట్లు ప్రచారం అవుతుండటంతో.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని స్క్రీనింగ్‌ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీ కే నివేదించనుంది. పీఈసీ జాబితాను పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిటీకి.. కాంగ్రెస్‌? స్క్రీనింగ్‌ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. టికెట్లకోసం పోటీపడుతున్న ఆశావహుల్లో కొందరు దిల్లీ బాటపట్టారు. ప్రధానంగా స్క్రీనింగ్‌ వద్ద తమ గురించి ప్రస్తావించి టికెట్‌ వచ్చేటట్టుగా చూడాలని.. ఏఐసీసీ నేతలను ఆశావహులు కోరుతున్నారు. స్క్రీనింగ్‌ కమిటీ భేటీ నేపథ్యంలో ఆశావహులు కొందరు.. దిల్లీ వెళ్లి స్క్రీనింగ్‌ కమిటీకి సిఫార్సు చేసుకునే పనిలో ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు