Sunday, May 19, 2024

జయహో నారీమణి..

తప్పక చదవండి
  • మహిళా బిల్లుతో మారనున్న రాజకీయ ముఖచిత్రం..
  • ఎన్డీయే సర్కార్ ఈ నెల 18న మహిళా బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం..
  • ఏండ్లుగా మగ్గుతున్న బిల్లుపై బీజేపీ నజర్ పెట్టడంపై సర్వత్రా చర్చ..
  • బిల్లు అమలయితే 119 స్థానాల్లో 33కు పైగా సీట్లలో మార్పులు..
  • నూతన శకానికి నాంది మహిళా బిల్లు అని పలువురి ప్రశంశ..
  • మహిళా బిల్లు అమలయితే 33 శాతం చట్ట సభల్లో మహిళలు..

( తుపాకీతో ఉన్న పురుషుడి చేతిలో కన్నా.. కత్తి చేతబూనిన స్త్రీ చేతిలో చావడం ఎంతో మిన్న అన్న చేగువేరా మాటల్లో ఎంతో గూడార్ధం ఉంది.. స్త్రీ గొప్పతనాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.. )

మహిళా ఇక నిదుర నుంచి మేలుకో.. తర తరాల నీ దుస్థితి తెలుసుకో.. చలో ముందుకు భయాలెందుకు.. స్వశక్తి చూపి సాగు ముందుకు.. ప్రెజర్ కుక్కరైనా వాషింగ్ పౌడరైనా .. ఆడదాన్నే మోడల్ గా చూపాలా..? వంట ఇంటి కూచివన్న ముద్ర వెయ్యాలా.. ఆడదానివంటూ నీకేమి తెలుసునంటూ.. ఇంటా బయట హేళన చేస్తూంటే నువ్వు అణిగి మణిగి బానిసలా ఉండాలా.. అడ్డులేని స్వాతంత్ర్యం మగధీరులకా.. బాధలు భోధలు ఆడపిల్లకా.. సాగాలి ఈ విప్లవం.. మనదేలే అంతిమ విజయం.. నిలబడు ఎదురు తిరిగి కలబడు అన్నాడు ఓ కవి

- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18న జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బిల్లు అమలయితే రాష్ట్రంతో పాటు దేశంలో పలు సంచలనాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయనని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్నెండ్లుగా మగ్గుతున్న బిల్లుపై బీజేపీ నజర్ పెట్టడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ బిల్లు అమలయితే నూతన శఖానికి నాంది అవుతుందని చెప్పవచ్చు.. నిజానికి భారత దేశానికి స్వాతంత్ర్యం రాగానే అసమానత్వపు విత్తనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దేశంలో ఎక్కువశాతం పురుషాధిక్యం కొనసాగడంతో క్రమంగా మహిళలకు పలు రంగాల్లో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అయితే మహిళల ప్రాతినిథ్యం ఎందుకు తగ్గుతోందన్న అంశంపై ఎక్కడా చర్చ జరగలేదు కానీ 1971లో తొలిసారిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం ఎందుకు తగ్గిపోతోందో తెలుసుకునేందుకు అప్పటి ప్రభుత్వం ఓ కమిటీ వేయడం జరిగింది. అయితే తొలుత ఈ కమిటీ చట్టసభల్లో రిజర్వేషన్‌ను రికమెండ్ చేయలేదు. కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావాలంటూ నివేదిక మాత్రమే ఇచ్చింది. దాంతో రాజ్యాంగంలోని 73,74వ రాజ్యాంగ సవరణలు చేసి పార్లమెంటులో పాస్ చేయడం జరిగింది. దీంతో పంచాయతీల్లో, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇందుకు అదనంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. పార్లమెంటులో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావించింది మాత్రం 1996లో అప్పటి దేవెగౌడ ప్రభుత్వం. దీన్ని 81 రాజ్యాంగ సవరణ బిల్‌గా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్ కూడా మరుగున పడింది. తిరిగి ఇదే అంశాన్ని 1998, 1999, 2002, 2003లో తీసుకొచ్చినప్పటికీ ఫలితం ఇవ్వలేదు.

ప్రభుత్వాల వైఫల్యంతోనే బిల్లు అమలుకు నోచుకోలేదు :
మహిళల రిజర్వేషన్ బిల్లుపై గత ప్రభుత్వాలు ఎలాంటి గట్టి చర్యలు చేపట్టలేదు. అయితే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించారు. ఈ బిల్లు ప్రకారం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ రొటేషనల్ పద్ధతిలో ఉంటుందని పొందుపర్చారు. అంతేకాదు డ్రా పద్దతిలో ఒక సీటు ప్రతి మూడు సాధారణ ఎన్నికలకు ఒకసారి మహిళలకు కేటాయిస్తామని పొందుపర్చారు. అయితే చాలా బలహీనంగా ఉన్న ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపలేదు. ఇక అప్పటి నుంచి బిల్లు సంగతే పట్టించుకోలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదల్ పార్టీ ఉన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడం న్యాయంగా లేదని వాదించాయి. తర్వాత చాలాకాలానికి కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్డీయే సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాలని భావిస్తోంది.

బిల్లు అమలయితే 119 స్థానాల్లో 33 కు పైగా సీట్లలో మార్పులు :
ఒక వేళ ఈ బిల్లు అమలయితే తెలంగాణ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది.. మహిళలకు 33శాతం చట్టసభల్లో ప్రాతినిత్యం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో పురుడుపోసుకోనున్న మహిళా బిల్లుతో పలువురి నాయకుల రాజకీయ భవిష్యత్తు తుడిచిపెట్టుకుని పోనుందని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో సీనియర్లుగా తిష్టవేసుకుని కూర్చున్న నాయకుల భవితవ్యం మహిళ బిల్లు అమలుతో సందిగ్ధంలో పడనుందని తెలుస్తోంది. దీంతో ఈ సారి జరుగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలఫై రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తమ స్థానం మహిళకు కేటాయిస్తారోనన్న భయంతో పలువురు నేతలున్నారు. మహిళా బిల్లు తెరమీదకు రావడంతో పలువురు నాయకులు ఎన్నికల ప్రచారాలకు కూడా వెళ్లడం లేదట.
ఓక్ పక్క జమిలి ఎన్నికలంటూ ప్రచారం.. మరో పక్క మహిళా బిల్లు అమలవుతుందనే ప్రచారం నేతలను ఉక్కిరి బిక్కరి చేస్తుందట.. దీంతో నేతలందరూ ఏమి చేసిన 20 తరువాతే అంటున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు