Wednesday, April 24, 2024

పార్కు మాయం..!

తప్పక చదవండి
  • రూ.15 కోట్ల పార్కు స్థలం కబ్జా
  • శ్రీ సాయి నిలయ వెల్ఫేర్‌ సొసైటీ ఫిర్యాదు చేసిన పట్టించుకోరా..?
  • కబ్జా కోర్ల నుండి పార్కులను కాపాడేదెవరు..?
  • పార్కు స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని స్థానికుల డిమాండ్‌..!

ప్రభుత్వ స్థలాలు మాయ మవుతున్నాయి. ఎక్కడ గజం స్థలం కనిపించినా కబ్జా చేసేస్తున్నా రు. వాటికి పట్టాలు, రిజిస్ట్రేషన్లు పుట్టిస్తున్నారు. తాజాగా మేడ్చ ల్‌ పురపాలికకు చెందిన పార్కు స్థలం కబ్జా అవుతున్న వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్‌ పట్టణంలో భూముల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభు త్వ భూముల లేఔట్‌లోని పార్క్‌ స్థలాల కబ్జాకు పాల్పడుతున్నారు.

రూ.15 కోట్లు పార్కు స్థలం కబ్జా…?
మున్సిపాలిటీ పరిధిలోని చెక్‌ పోస్ట్‌ వద్ద శ్రీ సాయి నిలయ వెల్పేర్‌ సోసైటీ రెసిడెన్సి లోని లేఅవుట్‌ గల సర్వే నంబర్‌ 882/అ లో పార్క్‌ స్థలం దాదాపు 1970 చదరపు గజాలలో ఉంది, దానిపైన కన్నేసిన కొందరు కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారు.ఆ లేవుట్‌ లో ఒక గజం విలువ బహిరంగ మార్కెట్‌ లో ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పలుకు తుంది. ఆ లెక్కన పార్కు స్థలం సుమారు రూ.15 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం పార్కు స్థలంలో సిమెం ట్‌ దిమ్మెలను ఏర్పాటు చేస్తున్నారు. స్థలం చుట్టు కంచె ఏర్పాటు చేసేందుకు కబ్జాదారులు యత్నించారు. కబ్జాదారులకు రాజకీ య, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు పేర్కొంటు న్నారు. ఈ స్థలం చేజారి పోవడం వెనుక పెద్ద మొత్తంగా చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కొనాలంటే కష్టం.. కబ్జానే సులభం..
మేడ్చల్‌ మున్సిపాలిటీలో సామాన్యుడు భూమి కొనాలంటే చాలా కష్టం.. కానీ లేఔట్‌ లో పార్కు స్థలాలు కబ్జా చేసుకుని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలంటే ఇక్కడి ప్రజాప్రతినిధుల అండదండలు ఉంటే చాలు.. పార్కు స్థలాలు కాదు ప్రభుత్వ స్థలాలు సైతం కబ్జా చేసుకోవచ్చు. మున్సిపాలిటీ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మున్సిపల్‌ పరిధిలో పార్కు స్థలాలు కనుమరుగైపోవడం ఇందుకు నిదర్శనం.. .ఇకనైనా మున్సిపల్‌ అధికారులు పార్కు స్థలాలపై కన్నేసి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు.
కబ్జా విషయమై గతంలోనే మున్సిపల్‌ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా కబ్జా రాయుళ్ల నుంచి పార్కు స్థలాన్ని కాపాడుతారా..? లేదా..? వేచి చూడాల్సిందే మరీ..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు