- మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని విమర్శ
- గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేవని దేవినేని ఆవేదన
అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం దారుణంగా ఉన్నాయని అన్నారు. మైలవరం, కొండపల్లి మున్సిపాలిటీల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేవని విమర్శించారు. మైలవరం నియోజకవర్గం పుల్లూరులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. మట్టి, ఇసుక, కొండలు, గుట్టలను దోచుకోవడంలో పాలకులకు ఉన్న శ్రద్ధ పేదలకు మంచినీళ్లు ఇవ్వడంలో లేదని అన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలపై సీఎం జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.