Thursday, May 2, 2024

నిరుపేదల జీవితాలలో వెలుగు నింపుతున్న కంటి వెలుగు పథకం

తప్పక చదవండి

కొత్తూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్

కొత్తూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం నిరుపేదల జీవితాలలో వెలుగు నింపుతున్నదని కొత్తూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ సూచించారు. కొత్తూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని 9 వ వార్డు ప్రజల కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం కంటి వెలుగు కేంద్రాన్ని 9 వ వార్డు కౌన్సిలర్ మాదారం నర్సింలు గౌడ్ ఆధ్వర్యంలో ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ లావణ్య యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిరుపేదల సంక్షేమం కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఎంతో మంది నిరుపేదలకు వెలుగును ఇస్తుందని అన్నారు. మండలం తోపాటు మున్సిపల్ పరిధిలో వేల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు. అదేవిధంగా ఆర్థిక స్తొమత లేని నిరుపేదలకు వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో సహాయకరంగా నిలిచిందని ఆమె తెలిపారు.ప్రధానంగా షాద్ నగర్ నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో ఎమ్యెల్యే అంజయ్య యాదవ్ కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసి ఎంతో మంది నిరుపేదలకు సహాయం అందించారని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్, హరి కిషన్,మున్సిపల్ వైస్ ఛైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ సోంలా నాయక్,మాజీ ఉప సర్పంచ్ జండగూడెం శ్రీనివాస్ గౌడ్,నాయకులు పీర్లగూడెం గోపాల్ గౌడ్, విష్ణు మూర్తి, పేపర్ యాదయ్య, సత్యం,బాలు,వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు