Friday, November 1, 2024
spot_img

నేడే నాలుగు రైలు సర్వీసుల పొడగింపు..

తప్పక చదవండి
  • జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
  • నేటి నుంచే అమలులోకి పొడిగించిన రైలు సేవలు..

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నాలుగు రైలు సర్వీసుల పొడిగింపును నేడు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు సేవలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి.. ఈ పొడిగింపులో హడప్సర్ – హైదరాబాద్ ఎక్స్‌ ప్రెస్ కాజీపేట వరకు, జైపూర్ – కాచిగూడ ఎక్స్‌ ప్రెస్ కర్నూలు సిటీ వరకు, నాందేడ్ – తాండూరు ఎక్స్‌ ప్రెస్ రాయచూర్ వరకు, కరీంనగర్ – నిజామాబాద్ ఎక్స్‌ ప్రెస్ బోధన్ వరకు పొడిగించబడ్డాయి. కాగా ఈ రైలు సేవలకు అన్నీ క్లాసులకు బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివిధ గమ్యస్థానాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి, విస్తరించిన ప్రాంతంలోని ప్రజల అవసరాలను తీర్చడానికి నాలుగు జతల రైలు సేవలను విస్తరించారు. జి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నేడు జరిగే కార్యక్రమంలో పొడిగించిన ఈ రైలు సర్వీసులను జెండా ఊపి ప్రారంభంచేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కూడా హాజరవుతారని తెలుస్తోంది.. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. అదే సమయంలో కాచిగూడ, బోధన్, తాండూరు రైల్వేలలో ఫ్లాగ్‌ఆఫ్ ప్రోగ్రామ్‌ను చూసేందుకు కూడా కార్యక్రమాలు నిర్వహించనున్నారు .

పొడిగించబడిన రైలు సేవల వివరాలు ఇలా ఉన్నాయి :

- Advertisement -
  • కాజీపేట వరకు పొడిగించబడిన ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్,నం 17013/17014 హడప్‌సర్ – హైదరాబాద్ – హడప్‌సర్ ఎక్స్‌ప్రెస్
  • కర్నూలు సిటీ వరకు పొడిగించబడిన వీక్లీ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం 19713/19714 జైపూర్ – కాచిగూడ – జైపూర్ ఎక్స్‌ప్రెస్
  • రాయ్‌చూర్ వరకు పొడిగించబడిన రోజువారీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం 17664/17663 హెచ్‌ఎస్ నాందేడ్ – తాండూరు- పర్భాని ఎక్స్‌ప్రెస్
  • బోధన్ వరకు పొడిగించబడిన డైలీ ప్యాసింజర్ ట్రైన్ నం 07894/07893 కరీంనగర్ – నిజామాబాద్ – కరీంనగర్ ప్యాసింజర్

కాగా ఆదివారం నుంచి పొడిగించిన రైలు సర్వీసుల ముందస్తు రిజర్వేషన్ బుకింగ్ స్టార్టయ్యింది. ఈ రైలు సర్వీసులు తెలంగాణ ప్రజలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాయి. సుదూర ప్రాంతాలకు నేరుగా రైలు సౌకర్యం కలిగి ఉంటాయి. కాజీపేట ప్రజలు పూణే వరకు ప్రయాణించడానికి సులభతరమైన రాత్రి ప్రయాణ సౌకర్యంను కలిగిస్తుంది. షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు నగరాల ప్రజలకు జైపూర్ వైపు నేరుగా, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అదేవిధంగా సేడం, చిత్తాపూర్, యాద్గిర్, రాయచూర్ చుట్టుపక్కల ప్రజలు ఇప్పుడు ఈ పొడిగించిన రైలు సర్వీస్‌తో నాందేడ్ వైపు సౌకర్యంగా ప్రయానించవచ్చు. బోధన్ ప్రజలకు ఇప్పుడు బోధన్ – కరీంనగర్ మధ్యలో ప్రయాణించే వీలుగా ప్రత్యక్ష రైలు సౌకర్యం కలుగుతుంది. కరీంనగర్ – నిజామాబాద్ – బోధన్ ప్యాసింజర్ స్పెషల్ పగటిపూట నడుస్తుంది. ఇది సెకండ్ జనరల్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటుంది. సుదూర గమ్యస్థానాలకు నడపబడుతున్న మిగిలిన రైలు సర్వీసులు ఏసీ తరగతులు, స్లీపర్ క్లాస్, సెకండ్ జనరల్ క్లాస్‌లతో కూడిన రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ విభాగాల వంటి అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీరుస్తాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు