Saturday, June 15, 2024

నేడే ఉప్పల్ భగాయత్ నూతన గౌడ హాస్టల్ ప్రారంభం

తప్పక చదవండి
  • హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు, గౌడ ప్రముఖులు..
  • గౌడ బంధువులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్..

హైదరాబాద్, 15 మే (ఆదాబ్ హైదరాబాద్) : గౌడ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి (తేదీ 16 .05. 2023 మంగళవారం) నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని ఉప్పల్ భగయత్ నందు నిర్మించిన గౌడ హాస్టల్ ప్రారంభం కలదు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు గౌడ్, రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మాత్యులు డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, అదే విధంగా గౌడ ముద్దు బిడ్డలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్, ఈ హాస్టల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ గౌడ బిడ్డలకు అంకితం చేస్తారు.. కావున సమస్త గౌడ బాంధవులు అందరు పాల్గొని విజయవంతం చేయగలరని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ గౌడ సంగం.. మేనేజింగ్ కమిటీ సభ్యులు, గౌడ హాస్టల్, హిమాయత్ నగర్, హైదరాబాద్.. డాక్టర్ అశోక్ గౌడ్ మొగుళ్ల కోరారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు