Wednesday, May 15, 2024

చర్చలు సఫలం

తప్పక చదవండి
  • అద్దె బస్సుల ఓనర్లతో ఆర్టీసీ ఎండీ భేటీ
  • నేటినుంచి యధావిధిగా బస్సులు
  • సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం
  • ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ వెల్లడి

హైదరాబాద్‌ : అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. గురువారం బస్‌ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడిరచారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్నారు. వారు కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. వారంరోజుల్లో సమస్యలు పరిష్కరిం చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు గాను సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్‌ సర్వీస్‌ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్‌ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్‌ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు అద్దె బస్సు ఓనర్ల సంఘం నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి బస్సులు నడుపమని స్పష్టం చేశారు. నేటి నుంచి యాథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని, సంక్రాంతికి కూడా ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని.. స్పెషల్‌ బస్సులు నడుపుతామని సజ్జనార్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ’మహాలక్ష్మి’ పథకం కింద ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో, ప్లలె వెలుగు బస్సుల్లో డిసెంబర్‌ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బస్సుల్లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల సంఖ్య రెండిరతలు అయ్యింది. ముఖ్యంగా ఎక్స్‌ ప్రెస్‌ బస్సులు, గ్రామాలకు వెళ్లే చివరి బస్సుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో బస్సుల కిటీకీల్లోంచి సైతం మహిళా ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఫుట్‌ బోర్డుల వద్ద సైతం వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయంటూ వాపోయారు. కేఎంపీఎల్‌ కూడా రావడం లేదని, అందుకే సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్లడంతో టైర్లు వేడెక్కి పేలే అవకాశం ఉంది. కమాన్‌ కట్టలపై అధిక లోడు పడి విరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్‌ఎంకు నోటీసులిచ్చారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ను కలిసి వినతి పత్రం సమర్పించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే, గురువారం సంస్థ ఎండీ సజ్జనార్‌ వారిని పిలిపించి సమస్యలపై చర్చించారు. సమస్యలు పరిష్కరిస్తామన్న సజ్జనార్‌ హావిూతో వారు సమ్మెకు వెళ్లాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2,700 అద్దె బస్సులు నడుస్తున్నాయి. మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడిపేలా టీఎస్‌ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ హైదరాబాద్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్టాలైన్ర ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. భాగ్యనగరం నుంచి ఏపీకి రద్దీ దృష్ట్యా 1,450 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. అటు, రాష్ట్రంలో ’మహాలక్ష్మి’ పథకం విజయవంతంగా అమలవుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ స్కీం కింద ఇప్పటివరకూ 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించినట్లు తెలుస్తుండగా, మంత్రులు అధికారులు, సిబ్బందిని అభినందించారు. టీఎస్‌ఆర్టీసీకి పూర్తి సహకారాలు అందిస్తామని, సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్‌, ఇతర సెటిల్‌ మెంట్లకు సంబంధించిన నిధులపై సవిూక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి రోజూ 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు చేస్తున్నామని అధికారులు వివరించారు. సంస్థను బలోపేతానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆలోచిస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. లాజిస్టిక్స్‌, కమర్షియల్‌, తదితర టికెటేతర ఆదాయంపైనా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు